NTV Telugu Site icon

IOCL Apprentice Recruitment 2023: ఆయిల్ ఇండియా కార్పొరేషన్ లో అప్రెంటిస్ పోస్టులు.. పూర్తి వివరాలు..

Job Vacancy

Job Vacancy

నిరుద్యోగులకు కేంద్ర ప్రభుత్వం వరుస గుడ్ న్యూస్ లను చెబుతుంది.. తాజాగా మరో సంస్థలో ఉన్న ఖాళీలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేసింది.. ఈ నోటిఫికేషన్ ప్రకారం ఆయిల్ ఇండియా కార్పొరేషన్ లో 1820 అప్రెంటిస్ పోస్టులను భర్తీ చెయ్యనున్నారు.. ఈ పోస్టులకు అర్హతలు, దరఖాస్తు చివరి తేదీ ఎప్పుడో తెలుసుకుందాం..

ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు డిసెంబర్ 16 నుంచి IOCL అధికారిక వెబ్‌సైట్ iocl.com ద్వారా ఆన్‌లైన్‌ లో అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకోవడానికిి లాస్ట్ డేట్ జనవరి 5, 2024.. సాయంత్రం ఐదు లోపు అప్లై చేసుకోవాలి..

అర్హతల విషయానికొస్తే.. గుర్తింపు పొందిన యూనివర్సిటీలో డిగ్రీ చేసిన అభ్యర్థులు అర్హులు.. దూర విద్యా విధానం ద్వారా, పార్ట్ టైమ్ విధానం ద్వారా, కరస్పాండెన్స్ విధానం ద్వారా విద్యార్హతలు పొందిన అభ్యర్థులు ఈ పోస్ట్ లకు అర్హులు కారు..

ఎంపిక ప్రక్రియ.. ఆన్ లైన్ రాత పరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఈ పరీక్ష ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. ఈ పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ ఉంటుంది..

గతంలో ఏదైనా పరిశ్రమలో ఒక సంవత్సరం లేదా ఆ పైన కాల పరిమితి కలిగిన అప్రెంటిస్ షిప్ ను పూర్తి చేసిన అభ్యర్థులు కూడా ఈ పోస్ట్ లకు అప్లై చేసుకోవడానికిి అనర్హులు.. ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకొనేవారు నోటిఫికేషన్ ను చదివి, వెబ్ సైట్ ను పరిశీలించి అప్లై చేసుకోగలరు..