NTV Telugu Site icon

Indian Army Recruitment 2024: ఇండియన్‌ ఆర్మీలో భారీగా ఉద్యోగాలు.. ఎలా అప్లై చేసుకోవాలంటే?

Indian Army

Indian Army

ఇండియన్ ఆర్మీలో జాబ్ చెయ్యాలనుకుంటున్న వారికి అదిరిపోయే గుడ్ న్యూస్.. నిరుద్యోగులకు శుభవార్త చెబుతూ ఆర్మీలో పలు ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ప్రకారం 381 పోస్టులను భర్తీ చెయ్యనున్నారు. ఈ పోస్టుల అర్హతలు, ఎలా అప్లై చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం..

మొత్తం ఖాళీలు.. 381 పోస్టులు..

పోస్టుల వివరాలు.. పురుషులు -350

ఇంజనీరింగ్‌ స్ట్రీమ్‌: సివిల్, కంప్యూటర్‌ సైన్స్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్, ఇతర ఇంజనీరింగ్‌ స్ట్రీమ్స్‌..

34వ షార్ట్‌ సర్వీస్‌ కమిషన్‌(టెక్‌) మహిళలు: 29 పోస్టులు..

ఇంజనీరింగ్‌ స్ట్రీమ్‌: సివిల్, కంప్యూటర్‌ సైన్స్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్‌. -ఎస్‌ఎస్‌సీ డబ్ల్యూ టెక్‌-01. -ఎస్‌ఎస్‌సీ డబ్ల్యూ నాన్‌-టెక్‌-01..

అర్హతలు..
సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్‌/ఏదైనా విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.

వయసు..

01.10.2024 నాటికి 20 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి.

జీతం..

రూ.56,100 నుంచి రూ.1,77,500.

ఎంపిక విధానం..

దరఖాస్తును షార్ట్‌లిస్ట్, స్జేజ్‌-1, స్టేజ్‌-2 ఎగ్జామినేషన్, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్, మెడికల్‌ ఎగ్జామినేషన్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దర ఖాస్తు చేసుకోవాలి..

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 21.02.2024
కోర్సు ప్రారంభం: అక్టోబర్‌ 2024.

వెబ్‌సైట్‌: https://joinindianarmy.nic.in/ లో ఈ ఉద్యోగాల గురించి మరిన్ని వివరాలను తెలుసుకోవచ్చు..