Site icon NTV Telugu

Central Govt Jobs : కేంద్ర ప్రభుత్వ సంస్థలో భారీగా ఉద్యోగాలు.. అర్హతలు, చివరితేదీ?

Jobbss

Jobbss

నిరుద్యోగులకు కేంద్ర ప్రభుత్వం వరుస గుడ్ న్యూస్ లను చెబుతుంది.. ఇప్పటికే పలు సంస్థల్లో ఖాళీలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేసింది.. తాజాగా మరో నోటిఫికేషన్ ను విడుదల చేసింది.. ఈ నోటిఫికేషన్ ప్రకారం మొత్తం 968 జూనియర్ ఇంజనీర్ పోస్టులను భర్తీ చెయ్యనున్నారు.. ఈ పోస్టుల గురించి కాస్త వివరంగా తెలుసుకుందాం..

మొత్తం పోస్టుల సంఖ్య.. 968

పోస్టుల వివరాలు..

968 జూనియర్ ఇంజనీర్ పోస్టులను భర్తీ చెయ్యనున్నారు..

అర్హతలు..

డిప్లొమా(సివిల్‌/మెకానికల్‌/ఎలక్ట్రికల్‌) తత్సమానం లేదా డిగ్రీ (సివిల్‌ /మెకానికల్‌/ఎలక్ట్రికల్‌) చదివినవారు అర్హులు..

వయసు..

32 ఏళ్లు, ఇతర పోస్టులకు 30 ఏళ్లు మించకూడదు. వివిధ కేటగిరీల వారికి వయోపరిమితుల్లో సడలింపులు ఉన్నాయి..

జీతం..

సెవెన్త్‌ పే స్కేల్‌ ప్రకారం-రూ.­35,400 నుంచి రూ.1,12,400 ఉంటుంది.

ఎంపిక ప్రక్రియ ..

రాతపరీక్షలు, ధ్రువపత్రాల పరిశీలన, వైద్య పరీక్షల ఆధారంగా ఎంపికచేస్తారు..

దరఖాస్తు విధానం..

ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 18.04.2024
కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష(పేపర్‌-1): 04.06.2024 నుంచి 06.06.2024వరకు..

ఈ పరీక్షల గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడం కోసం అధికార వెబ్ సైట్ https://ssc.gov.in/ లో చూడవచ్చు..

Exit mobile version