NTV Telugu Site icon

Canara Bank Recruitment 2023: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. డిగ్రీ అర్హతతో 500 ఉద్యోగాలు..

Canara Bank

Canara Bank

బ్యాంక్ ఉద్యోగం చెయ్యాలనుకునే వారికి అదిరిపోయే గుడ్ న్యూస్.. ప్రముఖ ప్రభుత్వ బ్యాంక్ అయిన కెనరా బ్యాంకులో పలు శాఖల్లో ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది. ఈ నోటిఫికేషన్ ప్రకారం 500 ప్రొబేషనరీ ఆఫీసర్/ మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టులను భర్తీ చేయనున్నట్లు పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభం కాగా.. దరఖాస్తు చేసుకోవడానికి ఆగస్టు 21 తేదీ ఆఖరి తేదీగా నిర్ణయించారు.. అర్హత, ఆసక్తి కలిగిన వాళ్ళు వెంటనే అప్లై చేసుకోండి.. ఈ ఉద్యోగాల గురించి పూర్తి వివరాలు..

అర్హతలు :
ఈ బ్యాంక్ విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం ఈ పోస్టులకు అర్హతలు.. అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ/బోర్డ్ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి.. అది పూర్తి చేసి మూడేళ్ల లోపు అయ్యి ఉండాలి..

వయస్సు :
అభ్యర్థుల వయస్సు ఆగస్టు 1, 2023 నాటికి కనిష్టంగా 20 ఏళ్లు.. అదే విధంగా గరిష్టంగా 30 ఏళ్లు మించకూడదని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు… అంటే ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు..

వయస్సు సడలింపు:
OBC (NCL) అభ్యర్థులు- 3 సంవత్సరాలు
SC/ST అభ్యర్థులు- 5 సంవత్సరాల
PwBD అభ్యర్థులు- 10 సంవత్సరాలు

దరఖాస్తు ఫీ :
SC/ST/PwD అభ్యర్థులకు- రూ.175
ఇతర అభ్యర్థులకు- రూ.850 చెల్లింపు విధానం – ఆన్‌లైన్ ద్వారా అప్లై చేసుకోవాలి

ఇంటర్వ్యూ ప్రక్రియ :
ప్రిలిమినరీ ఎగ్జామ్
మెయిన్ ఎగ్జామ్
ఇంటర్వ్యూ..

ముఖ్యమైన తేదీలు :
దరఖాస్తు ప్రారంభ తేదీ: 01/08/2023
దరఖాస్తు చేయడానికి చివరి తేదీ: ఆగస్టు 21, 2023

ఈ ఉద్యోగాలకు ఆసక్తి, అర్హత కలిగిన వాళ్ళు అధికారిక వెబ్ సైట్: https://ibpsonline.ibps.in/crppo13jun23/ లో పూర్తి వివరాల కోసం సందర్శించవచ్చు.. ఇక గతంలో కూడా ఈ బ్యాంక్ పలు శాఖల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేశారు.. వాటికి మంచిది స్పందన రావడంతో ఈ ఏడాది కూడా భారీగా ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ ను విడుదల చేశారు.. మీకు ఈ ఉద్యోగాల పై ఆసక్తి ఉంటే మీరు కూడా అప్లై చేసుకోండి..