NTV Telugu Site icon

BHEL Recruitment : భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ లో ఉద్యోగాలు.. పూర్తి వివరాలివే..

Bhel

Bhel

కేంద్ర ప్రభుత్వం పలు సంస్థల్లో ఖాళీ ఉన్న ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేస్తూ వస్తుంది.. ఈ క్రమంలో బీహెఈఎల్ లో ఖాళీ ఉన్న పలు పోస్టులకు నోటిఫికేషన్ ను విడుదల చేసింది.. ఈ నోటిఫికేషన్ ప్రకారం మొత్తం 11 ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌, సూపర్‌వైజర్ పోస్టుల భర్తీ చెయ్యనున్నారు.. ఈ ఉద్యోగాల గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం..

రెండు సంవత్సరాల కాల వ్యవధికి ఈ పోస్టుల్లో ఎంపికైన అభ్యర్ధులు కొనసాగాల్సి ఉంటుంది. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు.. వీటికి అప్లై చేసుకొనే అభ్యర్థులు అర్హతలకు సంబంధించి ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌కు 60 శాతం మార్కులతో బీఈ/బీటెక్ (ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్స్/ఇన్‌స్ట్రుమెంటేషన్/ కంప్యూటర్ సైన్స్). ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 50 శాతం మార్కులతో ఉత్తీర్ణలై ఉండాలి. సంబంధిత విభాగంలో పని అనుభవం ఉండాలి. ప్రాజెక్ట్‌ సూపర్‌వైజర్స్‌ కు 60 శాతం మార్కులతో డిప్లొమా (ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్స్). ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 50 శాతం మార్కులు ఉంటే సరిపోతుంది.. ఈ పోస్టులకు సంబందించి కాస్త అనుభవం కూడా ఉండాలి..

అభ్యర్థులకు వయస్సు 32 సంవత్సరాలకు మించరాదు. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తుంది. ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌ పోస్టులకు నెలకు రూ.82,620, ప్రాజెక్ట్‌ సూపర్‌వైజర్‌ పోస్టులకు నెలకు రూ.46,130 వేతనంగా చెల్లిస్తారు. అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. నవంబరు 1 దరఖాస్తులు సమర్పించేందుకు చివరి తేదిగా నిర్ణయించారు.. 4 వ తేదీ లోగా నోటిఫికేషన్ లో ఉన్న అడ్రెస్సుకు హార్డ్ కాఫీని పోస్ట్ చెయ్యాలి.. ఈ ఉద్యోగాలకు సంబందించిన మరింత సమాచారాన్ని తెలుసుకొనేందుకు వెబ్ సైట్ ; https://ednnet.bhel.in/ పరిశీలించగలరు..

Show comments