NTV Telugu Site icon

Bel Recruitment 2023: బెల్ లో పలు పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. అర్హతలేంటంటే?

Jobs

Jobs

ప్రభుత్వం ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ లో భారీగా ఉద్యోగాలను భర్తీ చేసేందుకు తాజాగా నోటిఫికేషన్ ను విడుదల చేసింది.. ఈ నోటిఫికేషన్ ప్రకారం.. విశాఖపట్నంలోనిసాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ సెంటర్‌లో తాత్కాలిక ప్రాతిపదికన పలు పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది.. ఉద్యోగాలు, అర్హతలు ఏంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

పోస్టుల వివరాలు

మొత్తం ఖాళీల సంఖ్య: 57

ట్రైనీ ఇంజినీర్: 45 పోస్టులు

ప్రాజెక్ట్ ఇంజినీర్: 12 పోస్టులు..

అర్హతలు..

55 శాతం పాస్ మార్కులను పొందిన బీఎస్సీ(ఇంజినీరింగ్‌)/ బీఈ, బీటెక్‌(కంప్యూటర్ సైన్స్,ఎలక్ట్రికల్/ ఎలక్ట్రికల్ అండ్‌ ఎలక్ట్రానిక్స్/ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/ సీఎస్‌ఈ/ ఐఎస్‌/ ఐటీ/ ఎలక్ట్రానిక్స్/ ఎలక్ట్రానిక్స్ అండ్‌ కమ్యూనికేషన్/ ఎలక్ట్రానిక్స్ అండ్‌ టెలికమ్యూనికేషన్/ టెలికమ్యూనికేషన్/ కమ్యూనికేషన్/ మెకానికల్/ ఇన్ఫర్మేషన్ సైన్స్ తోపాటు సంబంధిత విభాగంలో పని అనుభవం ఉండాలి.. అప్పుడు సెలెక్ట్ అవుతారు..

వయోపరిమితి..

01.02.2023 నాటికి ట్రైనీ ఇంజినీర్ పోస్టులకు 28 ఏళ్లు,ప్రాజెక్ట్ ఇంజినీర్ ఖాళీలకు 32 ఏళ్లు మించకూడదు.

జీతం..

నెలకు ట్రైనీ ఇంజినీర్ ఖాళీలకు రూ.30,000-రూ.40,000 వరకు ఉంటుంది.. అలాగే ప్రాజెక్ట్ ఇంజినీర్ ఖాళీలకు రూ.40,000-రూ.55,000 వరకు అందిస్తారు.

ఎంపిక ప్రక్రియ..

రాత పరీక్,ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

అప్లికేషన్ ఫీజు..

ట్రైనీ ఇంజినీర్ పోస్టులకు రూ.177,ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టులకు రూ.472. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు…

ఈ ఉద్యోగాలకు అప్లై చేసేవాళ్లు ఈ నెల 27 లోపు ఆన్ లైన్ లో అప్లై చేసుకోగలరు.. మరింత సమాచారం కోసం అధికారిక వెబ్ సైట్ ను పరిశీలించగలరు..