NTV Telugu Site icon

Ap Jobs 2023 : నిరుద్యోగులకు శుభవార్త.. ఆ శాఖలో 70 పోస్టులకు దరఖాస్తుల స్వీకరణ.. వివరాలివే..

Ap Logo

Ap Logo

ఏపీ నిరుద్యోగులకు జగన్ సర్కార్ అదిరిపోయే గుడ్ న్యూస్ ను చెప్పింది.. దేవాదాయ శాఖ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఏఈఈ, టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగ ఖాళీల భర్తీకి సిద్ధమైంది. మొత్తం 70 ఉద్యోగ ఖాళీలను భర్తీ చెయ్యనున్నారు..ఈ ఉద్యోగాల గురించి ఇప్పుడు వివరంగ తెలుసుకుందాం..

పోస్టుల వివరాలు..

ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (సివిల్) ఉద్యోగ ఖాళీలు 35 ఉండగా అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్(ఎలక్ట్రికల్) ఉద్యోగ ఖాళీలు 5 ఉన్నాయి..టెక్నికల్ అసిస్టెంట్ (సివిల్) ఉద్యోగ ఖాళీలు మాత్రం 30 ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ కు చెందిన హిందూ మతస్థులు మాత్రమే ఈ ఉద్యోగాలకు అర్హత కలిగి ఉంటారు..

అర్హతలు..

బీఈ, బీటెక్‌ (సివిల్ లేదా ఎలక్ట్రికల్) పాసైన వాళ్లు ఏఈఈ ఉద్యోగాలకు అర్హులు కాగా ఎల్‌సీఈ డిప్లొమా పాసైన వాళ్లు టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగ ఖాళీలకు అర్హత కలిగి ఉంటారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు సడలింపు కూడా ఉంటుంది..42 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హత కలిగి ఉంటారు

జీతం..

ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన వారికి నెలకు ఏఈఈకి రూ.35,000 వేతనం లభించనుండగా టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగానికి ఎంపికైన వాళ్లకు రూ.25,000 తో పాటు అదనపు అలవెన్సు లభించే అవకాశం అయితే ఉంటుంది..

ఎంపిక విధానం..

రాత పరీక్ష, ఇంటర్వ్యూ, సర్టిఫికెట్ వెరిఫికేషన్, మెడికల్ పరీక్ష ఆధారంగా ఈ ఉద్యోగాలకు ఎంపిక ప్రక్రియ జరుగుతుంది…

అప్లికేషన్ ఫీజు..

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ఫీజు 500 రూపాయలు కాగా ది కన్వీనర్‌, రిక్రూట్‌మెట్‌ సర్వీస్‌, పవర్‌ అండ్‌ ఎనర్జీ డివిజన్‌ ఇంజినీరింగ్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఇండియా, గచ్చిబౌలి, హైదరాబాద్‌ అడ్రస్ కు ఈ ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తులను పంపాలి..

ఈ ఉద్యోగాలకు అప్లై చేసే వాళ్లు జనవరి ఐదు లోపు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.. ఈ ఉద్యోగాలకు అప్లై చేసేవాళ్ళు నోటిఫికేషన్ పూర్తిగా చదివి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది..

Show comments