NTV Telugu Site icon

AP Govt Jobs : నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఆ శాఖలో ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్..

Jobs

Jobs

ఏపీ ప్రభుత్వం నిరుద్యోగులకు వరుస గుడ్ న్యూస్ లను చెబుతుంది.. తాజాగా పౌర సరఫరాల శాఖలో ఖాళీలు ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేసింది.. ఈ నోటిఫికేషన్‌ ద్వారా 13 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఈ ఉద్యోగాలను ఒప్పంద/అవుట్‌ సోర్సింగ్‌ ప్రాతిపదికన ఫిల్ చేయనున్నారు. వీటిలో చార్టర్డ్‌ అకౌంటెంట్‌, అకౌంటెంట్‌ గ్రేడ్‌-3, డేటా ఎంట్రీ ఆపరేటర్‌ పోస్టులు ఉన్నాయి. ఈ మేరకు అర్హత వివరాలు తెలుపుతూ పోస్టులకు అప్లై చేసేందుకు నవంబర్‌ 10వ తేదీని లాస్ట్ డేట్ గా నిర్ణయించారు. ఈ పోస్టుల గురించి వివరంగా తెలుసుకుందాం..

అర్హతలు..

ఈ ఉద్యోగాల పై అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు నోటిఫికేషన్ చదివి అప్లై చేసుకోవాలి.. ఈ పోస్టులకు ఒక్కో పోస్ట్ కు ఒక్కో అర్హతలను కలిగి ఉంటుంది.. పోస్టును బట్టి డిగ్రీ, సీఏ, ఎంబీఏ, ఎంకాం ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలని పేర్కొన్నారు..

వయోపరిమితి..

అభ్యర్థుల వయసు 35 ఏళ్లు మించకూడదు..

ఆఫ్ లైన్ లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది..

చిరునామా..

ఏపీ జిల్లా పౌర సరఫరాల మేనేజర్ కార్యాలయం,

ఏపీ స్టేట్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ లిమిటెడ్,

గవర్నర్‌పేట్‌,

విజయవాడ..

గతంలో కూడా ఈ జాబ్స్ కోసం విడుదల చేసిన నోటిఫికేషన్ కు మంచి స్పందన రావడంతో ఇప్పుడు మరో నోటిఫికేషన్ ను విడుదల చేసారు.. మీరు మీ దరఖాస్తులు నవంబర్‌ 10, 2023 లోగా అందాలి. మరిన్ని వివరాలకు వెబ్‌సైట్‌: http://www.apscscl.in/ సందర్శించండి…