NTV Telugu Site icon

AP Govt Jobs 2024: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఆ శాఖలో పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్..

Ap Logo

Ap Logo

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగులకు వరాల జల్లు కురిపిస్తుంది.. వరుసగా నిరుద్యోగులకు శుభవార్తలను చెబుతుంది.. తాజాగా ఓ ప్రభుత్వ శాఖలో ఉండే ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ను విడుదల చేశారు.. ఈ నోటిఫికేషన్ ప్రకారం ఏపీ శిశు సంక్షేమ శాఖలో పలు పోస్టులను భర్తీ చెయ్యనున్నారు.. ఇప్పుడు విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం మొత్తం 10 పోస్టులను భర్తీ చెయ్యనున్నారు.. ఈ పోస్టుల గురించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..

మొత్తం పోస్టుల సంఖ్య..10

పోస్టుల వివరాలు..

సోషల్‌ వర్కర్‌ కమ్‌-ఎర్లీ చైల్డ్‌ హుడ్‌ ఎడ్యుకేటర్‌-01, నర్స్‌-01, డాక్టర్‌(పార్ట్‌టైం)-01, ఆయా(మహిళలు)-06, చౌకీదార్‌-01..

అర్హతలు..

పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో పదో తరగతి,ఇంటర్, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

వయసు..
ఈ పోస్టులకు అప్లై చేసుకొనే అభ్యర్థులకు 25 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.

దరఖాస్తు విధానం..

ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును జిల్లా మహిళా శిశు సంక్షేమ, సాధికారత అధికారి కార్యాలయం, తిరుపతి, తిరుపతి జిల్లా చిరునామకు పంపించాలి.

దరఖాస్తులకు చివరితేది: 26.01.2024.

వెబ్‌సైట్‌: https://tirupati.ap.gov.in/ ఈ వెబ్ సైట్ ద్వారా మీకు ఈ పోస్టుల గురించి ఏదైనా సందేహాలు ఉంటే తెలుసుకోవచ్చు..