Site icon NTV Telugu

Agnivir Vayu Recruitment 2024: అగ్నివీర్ రిక్రూట్ మెంట్ కు దరఖాస్తులు షురూ.. ఎలా అప్లై చేసుకోవాలంటే?

Jobbss

Jobbss

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో ఉద్యోగం పొందాలని అనుకొనేవారికి అదిరిపోయే గుడ్ న్యూస్.. భారతీయ వైమానిక దళం అగ్నివీర్ వాయు రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తు ప్రక్రియను నేటి నుంచి ప్రారంభించింది.. అధికారిక వెబ్‌సైట్ agnipathvayu.cdac.inలో దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఇది ప్రారంభమైన తర్వాత, అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా అప్లై చేసుకోవచ్చు.. ఈ ఉద్యోగాల గురించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..

ఈ నోటిఫికేషన్ ప్రకారం.. అభ్యర్థులు ఈ రిక్రూట్‌మెంట్ కోసం 6 ఫిబ్రవరి 2024 వరకు మాత్రమే దరఖాస్తు చేసుకోగలరు. ఇదే చివరి తేదీ.. ఇక అగ్నివీర్ వాయు రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు రూ. 550 అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. దీన్ని డెబిట్ కార్డ్/క్రెడిట్ కార్డ్/ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా పేమెంట్ గేట్‌వే ద్వారా చెల్లించవచ్చు..

వయోపరిమితి..

ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకొనే వాళ్లకు కనీస వయస్సు పదిహేడున్నర సంవత్సరాలు, గరిష్ట వయస్సు 21 సంవత్సరాలు ఉండాలి..

ఇంటర్వ్యూ ప్రక్రియ..

ఈ రిక్రూట్‌మెంట్‌లో మూడు దశల ఎంపిక ఉంటుంది.
దశ 1- కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT)
దశ 2- ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్ (PFT)
దశ 3- అడాప్టబిలిటీ టెస్ట్, మెడికల్ టెస్ట్

జీతం..

ఇందులో ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 30,000జీతం ఉంటుంది. దీంతోపాటు వార్షిక ఇంక్రిమెంట్ ప్యాకేజీ కూడా ఉంటుంది..

ఈ ఉద్యోగాల గురించి మరింత సమాచారం తెలుసుకోవాలంటే అధికార వెబ్ సైట్ ను సందర్శించండి..

Exit mobile version