NTV Telugu Site icon

AAI Jobs 2023: గుడ్‌న్యూస్.. ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో 900 ఉద్యోగాలు.. పూర్తి వివరాలు..

Aai Jobs

Aai Jobs

నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్… ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో భారీగా ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేశారు.. ఈ నోటిఫికేషన్ ప్రకారం 900 ఉద్యోగాలను విడుదల చేశారు.. డిగ్రీ అర్హతతో సెక్యూరిటీ స్క్రీనర్ (ఫ్రెషర్) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి సంస్థ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఇప్పటికే రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం కాగా, ఈ గడువు డిసెంబర్ 8న ముగుస్తుంది. దీంతో అర్హులైన అభ్యర్థులు అధికారిక పోర్టల్ aaiclas.aero ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.. పూర్తి వివరాలు తెలుసుకుందాం..

మొత్తం పోస్టులు.. 906

AAICLAS ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా మొత్తంగా 906 సెక్యూరిటీ స్క్రీనర్ పోస్టులను భర్తీ చేస్తుంది..

వయోపరిమితి..

ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకొనే అభ్యర్థుల వయసు 27 ఏళ్లలోపు ఉండాలి. గరిష్ట వయోపరిమితి విషయంలో ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు, ఈఎస్‌ఎం అభ్యర్థులకు ఐదేళ్ల సండలింపు ఉంటుంది..

అప్లికేషన్ ఫీజు..

జనరల్, ఓబీసీ కేటగిరీ అభ్యర్థులు రూ.750 అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ.100 పేమెంట్ చేయాలి..

అర్హతలు..

గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. జనరల్ కేటగిరీ అభ్యర్థులకు కనీసం 60 శాతం మార్కులు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 55 శాతం మార్కులు వచ్చిన వారు అప్లై చేసుకోవచ్చు..

ఇంటర్వ్యూ ప్రక్రియ..

అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ నాలుగు దశల్లో ఉంటుంది. మొదటి దశలో పర్సనల్ ఇంటరాక్షన్, రెండో దశలో డాక్యుమెంట్ వెరిఫికేషన్, మూడో దశలో రాత పరీక్ష, నాలుగో దశలో మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది..

జీతం..

అభ్యర్థులకు మొదటి సంవత్సరం నెలకు రూ.30వేలు జీతం లభిస్తుంది. ఆ తరువాత రెండో సంవత్సరం నుంచి నెలకు రూ.32వేలు, మూడో సంవత్సరం నెలకు రూ.34వేల జీతం లభిస్తుంది.. సెలెక్ట్ అయిన వారు దేశ వ్యాప్తంగా జాబ్ చేయాల్సి ఉంటుంది..

ఎలా అప్లై చేసుకోవాలంటే?

ముందుగా AAICLAS అధికారిక పోర్టల్ aaiclas.aero ఓపెన్ చేయాలి.

హోంమ్‌పేజీలోకి వెళ్లి, ‘కెరీర్స్’ ఆప్షన్‌పై ట్యాప్ చేయాలి. దీంతో కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.

అక్కడ ‘AAICLAS సెక్యూరిటీ స్క్రీనర్ రిక్రూట్‌మెంట్-2023’ లింక్‌పై క్లిక్ చేసి నోటిఫికేషన్ వివరాలను పరిశీలించాలి.

ఆ తరువాత ‘అప్లైనౌ’ అనే ఆప్షన్ క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోవాలి. ముందుగా వ్యక్తిగత వివరాలను ఎంటర్ చేసి రిజిస్టర్ అవ్వాలి.

రిజిస్టర్ ఐడీతో లాగిన్ అయి అప్లికేషన్ ఫారమ్ ఓపెన్ చేయాలి. ఫారమ్ నింపి, అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. అవసరమైన డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేయాలి. చివరగా అప్లికేషన్‌ను సబ్‌మిట్ చేయాలి.. ఈ ఉద్యోగాలకు అప్లై చేసేవాళ్ళు నోటిఫికేషన్ ను బాగా చదివి అప్లై చేసుకోగలరు..