Site icon NTV Telugu

YouTuber Couple Found Dead: యూట్యూబర్ జంట అనుమానాస్పద మృతి..

Youtuber Couple Found Dead

Youtuber Couple Found Dead

YouTuber Couple Found Dead: కేరళలో యూట్యూబ్ జంట మృతి సంచలనంగా మారింది. కేరళోని పరస్సాల పట్టణంలోని వారిని నివాసంలో ఆదివారం శవాలుగా కనిపించారు. పోలీసులు దీనిని ఆత్మహత్యగా అనుమానిస్తున్నారు. వీరిద్దరు కనిపించకపోవడంతో ఇరుగుపొరుగు వారు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటన వెలుగులోకి వచ్చింది. పరస్సలా పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సెల్వరాజ్ (45) ఉరి వేసుకుని మృతి చెందగా, అతని భార్య 40 ఏళ్ల ప్రియ మృతదేహం బెడ్‌పై కనిపించింది.

Read Also: Samyuktha Menon: “బ్రెస్ట్ క్యాన్సర్‌ అవేర్‌నెస్‌లో భాగమవుదాం”..హీరోయిన్ సంయుక్త పిలుపు

ప్రాథమిక విచారణ ప్రకారం.. రెండు రోజుల క్రితమే మరణాలు సంభవించాయని తెలుస్తోంది. సెల్వరాజ్ (45), అతని భార్య ప్రియ (40) అనే దంపతులు ‘సెల్లు ఫ్యామిలీ’ అనే యూట్యూబ్ ఛానెల్‌ని నడుపుతున్నారు. వారి ఛానెల్‌కు దాదాపుగా 18,000 సబ్‌స్రైబర్లు ఉన్నారు. 1400 కంటే ఎక్కువ వీడియోలు పోస్ట్ చేశారు. చివరిసారిగా వీరు శుక్రవారం రాత్రి చివరిసారిగా వారి ఫోటోలను పోస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.

Exit mobile version