Site icon NTV Telugu

ప్రేమించినవాడు ఆ పని చేయడంలేదని ప్రేయసి ఏం చేసిందంటే..?

women

women

వారిద్దరూ కాలేజ్ లో స్నేహితులు.. కాలేజ్ అయిపోయాక ఇద్దరు విడిపోయారు.. ఎవరి ఉద్యోగాలు వారు చేసుకొంటూ ఉంటుండగా సోషల్ మీడియా మళ్లీ వారిని కలిపింది. ఈసారి వారి స్నేహం.. ప్రేమాగా మారింది. త్వరలోనే పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు. అయిపోతే ఈ విషయాన్ని ఇంట్లో చెప్పి ఒప్పించాలనుకున్నారు. ఆ తరువాత ఇద్దరు ఒకే ఇంట్లో సహజీవనం మొదలు పెట్టారు. రోజులు గడుస్తున్నా ప్రియుడు మాత్రం పెళ్లి ఊసు ఎత్తలేదు. దీంతో తట్టుకోలేని ఆమె బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన హైదరాబాద్ లో వెలుగు చూసింది.

వివరాల్లోకి వెళితే.. ఖమ్మం జిల్లాకు చెందిన బండి గౌతమ్‌ (32), భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన కొండ పవిత్ర (30) కాలేజ్ లో చదువుకొనేటప్పుడే స్నేహితులు.. కాలేజ్ అయిపోయాక ఇద్దరు విడిపోయారు.. ఉద్యోగాల నిమిత్తం హైదరాబాద్ చేరిన తర్వాత మళ్లీ ఫేస్‌బుక్‌ ద్వారా టచ్ లోకి వచ్చారు. ఆ స్నేహం కాస్తా ప్రేమగా మారింది. ఇద్దరు తమ ప్రేమ గురించి పెద్దలకు చెప్పారు. అమ్మాయి తరుపువారు ఒప్పుకొన్నారు కానీ అబ్బాయి తరువుపెరు ససేమిరా అన్నారు. అంతేకాకుండా గౌతమ్ కి మరో అమ్మాయితో వివాహం చేయడానికి నిశ్చయించారు. ఈ విషయం తెలుసుకున్న పవిత్ర ఆ పెళ్లిని అడ్డుకొని గౌతమ్ ని తీసుకొని హైదరాబాద్ కి వచ్చేసింది. హైదరాబాద్ లోనే కేపీహెచ్‌బీ కాలనీ 5వ ఫేజ్‌లో ఇద్దరు ఒక ఇంటిని తీసుకొని కలిసి ఉంటున్నారు.

రోజులు గడుస్తున్నా గౌతమ్ పెళ్లి వుడు ఎత్తడం లేదు. ఈ క్రమంలోనే సహజీవనం చేస్తోన్న గౌతమ్, పవిత్రల మధ్య పెళ్లి విషయంలో వాదోపవాదాలు పెరిగాయి. దీంతో ఆ ఒత్తిడి తట్టుకోలేని పవిత్ర ఇంట్లోనే ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఇక కూతురు మరణ వార్త విన్న తండ్రి హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని విలపించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

Exit mobile version