ప్రేమ.. ఎప్పుడు ఎవరి మధ్య పుడుతుందో చెప్పడం కష్టం.. ప్రేమిచుకున్నవారు ఇంట్లో పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకొంటారు.. ఇంకొందరు ఇంట్లో నుంచి వెళ్ళిపోయి తమ జీవితాన్ని గడుపుతారు.. మరికొందరు తమ ప్రేమ దక్కడంలేదని ఆత్మహత్యకు పాల్పడతారు.. అయితే ఇక్కడ జరిగిన ఘటనను దారుణం అనాలో విషాదం అనాలో తెలియడం లేదు.. ప్రేయసితో పెళ్లి కోసం ప్రియుడు ఆది ఒక చిన్న అబద్దం వారి జీవితాలను అతలాకుతలామ్ చేసింది. ప్రియుడు మృతి చెందాడని అనుకున్న ప్రేయసి ముందు వెనుక ఆలోచించకుండా బలవన్మరణానికి పాల్పడి ప్రాణాలను వదిలింది. ఈ ఘటన బెంగుళూరులో ఆలస్యంగా వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళితే హసన్ జిల్లాలోని చన్నారాయపట్నానికి చెందిన సాకమ్మ(24) యశ్వంత్పుర్లోని ఓ సూపర్ మార్కెట్లో పనిచేస్తోంది. అక్కడే ఆమెకు అరుణ్ అనే యువకుడు పరిచయమయ్యాడు. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ఇక వీరిద్దరి పెళ్ళికి ఇరి కుటుంబాలు ఒప్పుకోలేదు. కొన్నిరోజులు బతిమిలాడగా అరుణ్ వాళ్ళ తల్లిదండ్రులు కన్విన్స్ అవ్వగా .. సాకమ్మ తల్లిదండ్రులు మాత్రం ససేమిరా అని అందంతో అరుణ్ తన ప్రేయసితో పెళ్లి కోసం ఒక దారుణమైన ప్లాన్ వేశాడు.
తన ఫ్రెండ్ గోపాల్ చేత సాకమ్మ తల్లికి, బావకు పోలీస్ లా ఫోన్ చేయించి అరుణ్ ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు.. దానికి కారణం మీరే.. మీ అమ్మాయిని అతనికిచ్చి పెళ్లి చేయండి .. లేకపోతే మిమ్మల్ని అరెస్ట్ చేస్తాం అంటూ చెప్పించాడు. ఇక ఈ విషయాన్ని తెలుసుకున్న సాకమ్మ.. తన కోసంప్రియుడు మృతిచెందాడనుకొని, తాను లేని జీవితం నాకు వద్దని ఆమె ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకొని మృతిచెందింది. అరుణ్‌తో పెళ్లికి ఇరు కుటుంబాలు ఒప్పుకోలేదని, తను లేకుండా నేను బతకలేనని లేఖలో పేర్కొని ప్రాణాలు వదిలింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అరుణ్ ని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.
