భువనేశ్వర్ లో దారుణం చోటుచేసుకొంది. అత్తగారింటికి వెళ్లిన అల్లుడు తెల్లారేసరికి శవంలా కనిపించాడు. అనుమానాస్పదరీతిలో యువకుడు మృతిచెందడం ప్రస్తుతం స్థానికంగా సంచలనం రేపుతోంది. వివరాల్లోకి వెళితే.. కటాలి గ్రామానికి చెందిన శివమజ్జి పెద్ద కుమార్తెతో నందో మజ్జి(18)కి గతేడాది వివాహం నిశ్చయమైంది. త్వరలోనే వీరి వివాహం జరగనుంది. ఈ నేపథ్యంలోనే అప్పుడప్పుడు నందో అత్తవారింటికి వెళ్లి వస్తుండేవాడు. ఈ క్రమంలో గురువారం అత్తగారింటికి వెళ్లిన యువకుడు ఇంట్లో ఎవరు లేరని నిర్దారించుకొని ఫ్యాన్ కి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంటికి వచ్చిన అల్లుడు శవంగా ఫ్యాన్ కి వేలాడడం చూసి అత్తింటివారు నిర్ఘాంతపోయారు. అస్సలు నందో ఆత్మహత్యకు గల కారణాలు ఏంటి అనేది తెలిసిరాలేదు. ఈ గాహ్త్నపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. యువకుడిది హత్యా.. ఆత్మహత్య అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.
అత్తగారింట్లో అల్లుడు దారుణం.. ఎవరు లేని సమయంలో అలా చేసి

crime