Site icon NTV Telugu

అర్ధరాత్రి ఆసుపత్రిలో దారుణం.. అందరు చూస్తుండగానే యువకుడు అలా

అర్ధరాత్రి.. ఆ ఆసుపత్రిలో ఉన్న రోగులందరు ప్రశాంతంగా నిద్రపోతున్నారు. అంతలోనే సడెన్ గా ఒక యువకుడు వార్డులో పరుగులు పెట్టాడు.. అందరు నిద్రమత్తులో లేచి చూశారు.. అయినా యువకుడి పరుగు ఆగలేదు.. డైరెక్ట్ గా టెర్రస్ మీదకు వెళ్లి ఆగిన యువకుడిని వెంబడించిన వారు కూడా ఆగారు. యువకుడు వెనుక ఉన్నవారిని పట్టించుకోకుండా అక్కడి నుంచి కిందకు దూకేశాడు. ఒక్కసారిగా ఆఘటనను చుసిన మిగతావారు షాక్ కి గురయ్యారు. ఈ షాకింగ్ ఘటన ఛత్తీస్‌గఢ్‌ లో వెలుగుచూసింది.

వివరాలలోకి వెళితే.. ఛత్తీస్‌గఢ్‌ జాంజ్‌గిర్‌లోని బీడీఎం హాస్పిటల్ లో ఒక యువకుడు ఆత్మహత్యాయత్నం చేశాడు. గురువారం అర్ధరాత్రి హాస్పిటల్ బిల్డింగ్ పై నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు. వెంటనే ఆసుపత్రి సిబ్బంది గమనించి చికిత్స చేయడంతో ప్రాణాలతో బయటపడ్డాడు. యువకుడిని జంజ్‌గిర్‌లోని సియోని ప్రాంతానికి చెందిన జోసెఫ్‌గా గుర్తించారు. సమాచారమే అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని యువకుడిని విచారించారు. కుటుంబ సమస్యల వలనే తానూ ఆత్మహత్యకు పాల్పడినట్లు యువకుడు తెలిపాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు చేపట్టారు.

Exit mobile version