AP Crime: అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజవర్గంలో ఓ మహిళా ప్రభుత్వ ఉద్యోగిని కిడ్నాప్ వ్యవహారం సంచలనంగా మారింది.. దేవీపట్నం మండలం శరభవరం గ్రామ సచివాలయంలో.. సోయం శ్రీసౌమ్య వెల్ఫేర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్న సమయంలో 8 మంది వ్యక్తులు వచ్చి ఇన్నోవా వాహనంలో సినీ ఫిక్కీలో ఆమెను ఎత్తుకెళ్లారు. అయితే ప్రేమ వ్యవహారంతో ఈ కిడ్నాప్ జరిగినట్లుగా తెలుస్తోంది. కిడ్నాపర్లలో ఒకరైన కశింకోట అనిల్ ప్రేమ వ్యాహారంతో సౌమ్యను బలవంతంగా తీసుకెళ్లినట్లుగా భావిస్తున్నారు. గతంలో వీరిద్దరూ పారిపోయిన సమయంలో పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి తల్లిదండ్రులకు అప్పగించారు. తాజాగా ఈ ఘటనపై కేసు నమోదు చేసిన దేవీపట్నం పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు..
Read Also: Wi-Fi Users Alert: వైఫై యూజర్స్‌కి అలర్ట్.. వీటి గురించి తెలుసా..!
