ఎన్నో ఆశలతో ఆ జంట నగరంలో అడుగుపెట్టింది. పెళ్లై 15 రోజులు.. కొత్త కాపురం.. భార్యను వదిలి జాబ్ కి వెళ్లాలంటే ఏ భర్తకైనా మనసు ఒప్పదు… కానీ, వెళ్లకపోతే జాబే ఉండదు కాబట్టి తెగించాడు భర్త.. అదే అతడు చేసిన తప్పు. భార్యను ఇంట్లో ఒంటరిగా వదిలి నైట్ షిఫ్ట్ ఉద్యోగానికి వెళ్ళాడు. ఎలాగోలా ఆ రాత్రి ముగించుకొని తెల్లారి భార్య కోసం పరుగుపరుగున ఇంటికి వచ్చి డోర్ తీశాడు. అంతే.. అతడి కళ్లను అతడే నమ్మలేకపోయాడు.. హాల్లో నగ్నంగా భార్య.. రక్తపు మడుగులో విగతజీవిగా పడిఉంది. ఈ దారుణ ఘటన ముంబైలో ఆలస్యంగా వెలుగుచూసింది.
వివరాలలోకి వెళితే.. పాల్గర్ జిల్లాకు చెందిన ప్రియా కుంబ్లే(25) కు గత నెలలో వివాహామైంది. పెళ్లై పది రోజులు కావడంతో తమ సొంతూరు వదిలి ఉద్యోగ నిమిత్తం నగరానికి చేరుకున్నారు. ప్రియా భర్త ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. అతడిది నైట్ షిఫ్ట్ కావడంతో శుక్రవారం రాత్రి డ్యూటీకి వెళ్లేముందు భార్యకు జాగ్రత్తలు చెప్పి బయల్దేరాడు. శనివారం ఉదయం విధులు ముగించుకొని ఇంటికి చేరుకున్నాడు. డోర్ కొడుతున్నా భార్య పలకపోయేసరికి తన దగ్గర ఉన్న మరో తాళంతో డోర్ ఓపెన్ చేసి చూడగా.. ఓ భయంకరమైన దృశ్యం కనిపించింది. నగ్నంగా భార్య రక్తపు మడుగులో కనిపించింది. ఆమె మణికట్టు దగ్గర కత్తితో కోసినట్లు ఉండడం, బట్టలు లేకుండా ఉండడంతో ఆమెను రేప్ చేసి, హత్య చేసి ఉండొచ్చని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
