NTV Telugu Site icon

Mother: చేతులెలా వచ్చాయి తల్లీ.. భర్తతో గొడవపడి ముగ్గురు పిల్లల హత్య..

Mother

Mother

Mother: బీహార్ రాష్ట్రంలోని సమస్తిపూర్ జిల్లాలో ఓ తల్లి దారుణంగా ప్రవర్తించింది. భర్తతో గొడవ పడిన కోపంలో కన్న బిడ్డల్ని కడతేర్చింది. ముగ్గురు పిల్లల్ని చంపినందుకు పోలీసులు మహిళను సోమవారం అరెస్ట్ చేశారు. 36 ఏళ్ల సీమా దేవి తన భర్త చందన్ మహత్తతో గొడవ పడింది. ఈ గొడవ జరిగిన తర్వాత పిల్లల్ని తీవ్రంగా కొట్టి, ఆ తర్వాత బావిలో పడేసింది.

Read Also: Maha Shivaratri 2025: మహాశివరాత్రి నాడు జాగరణ, ఉపవాసం ఎలాంటి వారు చేయకూడదు?

ఈ ఘటనను కప్పిపుచ్చేందుకు సదరు మహిళ పిల్లలు కనిపించకుండా పోయారని భర్త మహత్తకు చెప్పింది. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. వారి ఇంటికి సమీపంలోని బావి నుంచి ముగ్గురు పిల్లల మృతదేహాలను వెలికితీశారు. బాధితులను తరుణ్ (6), తాన్య (4), తనిష్క్ (2) గా గుర్తించారు. విచారణలో సీమా తన నేరాన్ని అంగీకరించింది.