Woman Killed Her Husband With Supari Killers For Extramarital Affair In Bihar: మానవ సంబంధాలు మంటగలిసిపోతున్నాయని చెప్పడానికి తాజా ఉదంతాన్ని ప్రత్యక్ష ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఆరు పిల్లల తల్లి అయిన ఓ మహిళ.. తన వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని, ప్రియుడితో కలిసి తన భర్తను అత్యంత దారుణంగా హత్య చేయించింది. ఆపై తన నేరాన్ని కప్పిపుచ్చేందుకు కపటనాటకం ఆడింది. కానీ.. పోలీసుల విచారణలో భార్యే ప్రధాన నిందితురాలని తేలడంతో, ఇప్పుడు జైల్లో ఊచలు లెక్కబడుతోంది. ఆ వివరాల్లోకి వెళ్తే.. బీహార్‌లోని గోపాల్‌గంజ్ జిల్లా లాఢ్‌పుర్ గ్రామానికి చెందిన మహమ్మద్ మియాకు 21 సంవత్సరాల క్రితం నూర్జహాన్ ఖాతూన్ అనే మహిళతో వివాహం అయ్యింది. ఈ దంపతులకు ఆరుగురు పిల్లలు ఉన్నారు. చేపలు అమ్మే తనకు పెద్దగా డబ్బులు రాకపోవడంతో.. బాగా డబ్బులు సంపాదించాలన్న ఉద్దేశంతో దుబాయ్‌కి వెళ్లాడు. పెళ్లైనప్పటి నుంచి మహమ్మద్ దుబాయ్‌కి వెళ్తూ, వస్తూ ఉండేవాడు.
K. Vasu: ఇండస్ట్రీలో విషాదం.. చిరంజీవి మొదటి సినిమా డైరెక్టర్ మృతి..
అయితే.. నూర్జహాన్ మాత్రం భర్త దుబాయ్‌కి వెళ్లిన కొత్తలోనే నౌషద్ ఆలం అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. భర్త ఏడాదికి ఒకసారే ఇండియాకు తిరిగొస్తాడు కాబట్టి.. తన కామకోరికలు తీర్చుకోవడం కోసం, ఆ వ్యక్తికి దగ్గరైంది. ఇలా 21 సంవత్సరాల వరకు ఈ తతంగం నడుస్తూ వచ్చింది. మహమ్మద్‌కు ఏనాడూ తన భార్యపై అనుమానం రాలేదు. కానీ.. ఇటీవల దుబాయ్ నుంచి తిరిగొచ్చాక, భర్తకు నూర్జహాన్ బాగోతం తెలిసింది. నౌషద్‌తో వివాహేతర సంబంధం పెట్టుకుందన్న బాగోతం బయటపడింది. అది జీర్ణించుకోలేకపోయిన భర్త.. ఆమెను కొట్టాడు. ‘నీకేం తక్కువ చేశానని ఈ పాడు పని చేశావ్, నన్నెందుకు మోసం చేశావ్’ అంటూ కొట్టేవాడు. భర్త వేధింపుల్ని భరించలేకపోయిన నూర్జహాన్.. అతని అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకుంది. ఈ విషయం తన ప్రియుడు నౌషద్‌కి చెప్పింది. అప్పుడు ఇద్దరు కలిసి మహమ్మద్‌ని అంతమొందించేందుకు ఒక ప్లాన్ వేశారు. సుపారీ కిల్లర్లతో అతడ్ని హత్య చేయించాలని ఒక స్కెచ్ గీశారు. అనుకున్నదే తడువుగా.. సుపారీ కిల్లర్లను పిలిపించి, హత్యకు డీల్ కుదుర్చుకున్నారు.
Kethireddy Peddareddy: జేసీ కుటుంబానికి పెద్దారెడ్డి సవాల్.. అది నిరూపించగలరా?
కట్ చేస్తే.. మే 22వ తేదీన మహమ్మద్ ఇంటి బయట మంచంపై పడుకున్నాడు. ఇదే సరైన సమయమని భావించి, నూర్జహాన్ సుపారీ కిల్లర్లకు ఫోన్ చేసి, హత్యకు పురమాయించింది. వాళ్లు స్పాట్‌కి చేరుకొని, మహమ్మద్‌ని హతమార్చి, అక్కడి నుంచి పరారయ్యారు. భర్త చనిపోయాక.. ఎవరో తన భర్తని మత్య చేశారంటూ నాటకం మొదలుపెట్టింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా.. అసలు నిర్దోషులు నూర్జహాన్, నౌషద్ ఆలం అని తేల్చారు. తమ వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడన్న ఉద్దేశంతోనే అతడ్ని సుపారీ కిల్లర్స్‌తో చంపించామని నేరం అంగీకరించారు. వారి వాంగ్మూలం మేరకు.. సుపారీ కిల్లర్స్ అయిన మన్సూర్ ఆలం, పర్వేజ్ ఆలంలను అరెస్ట్ చేశారు. మహమ్మద్ హత్యకు వీరితో రూ.50 వేలకి డీల్ కుదుర్చుకున్నారని.. ఆ సొమ్ములోని రూ.28 వేలతో ఒక తుపాకీ, 4 బుల్లెట్లు కొనుగోలు చేసినట్లు ఆ సుపారీ కిల్లర్స్ తెలిపారు. నూర్జహాన్ చేసిన ఈ పనికి.. ఆ ఆరుగురు పిల్లలు అనాథలయ్యారు.