NTV Telugu Site icon

Live-In Relationship: భర్తతో విడాకులు.. డ్రైవర్‌తో సహజీవనం.. కట్ చేస్తే..

Live In Relationship Crime

Live In Relationship Crime

Woman Killed By Her Lover In Mysore: పాపం ఆ మహిళ.. పెళ్లయ్యాక తన జీవితం మారుతుందని, భర్తతో సంతోషంగా దాంపత్య జీవితాన్ని గడపొచ్చని కలలు కంది. కానీ.. ఆమె కలలు చెదిరిపోయాయి. విభేదాలు తలెత్తడంతో భర్తతో విడాకులు తీసుకుంది. అప్పటి నుంచి ఒంటరిగా ఉన్న తాను తోడు కోసం వెతుకుతుండగా.. ఒక డ్రైవర్ దొరికాడు. మనసుకు దగ్గరైన వాడు దొరికాడులే అని ఆనందించేలోపు.. అతడు కూడా దారుణంగా మోసం చేశాడు. చివరికి అతని చేతిలోనే ఆమె హత్యకు గురైంది. ఈ ఘటన మైసూరు నగరంలో చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే..

Taapsee Pannu: మరోసారి సౌత్ ఇండస్ట్రీపై తాప్సీ షాకింగ్ కామెంట్స్.. సంతృప్తి దొరకలేదట

మైసూరుకు చెందిన సౌమ్య అనే మహిళకు కొంతకాలం క్రితం ఒక వ్యక్తితో వివాహం అయ్యింది. మొదట్లో వీరి దాంపత్య జీవితం సజావుగానే సాగింది కానీ, ఆ తర్వాత మనస్పర్థలు ఏర్పడ్డాయి. తాను కలలు కన్న రీతిలో దాంపత్య జీవితం సాగకపోవడంతో.. సౌమ్య విడాకులు తీసుకుంది. భర్త నుంచి విడిపోయిన తర్వాత సౌమ్య టైలరింగ్ పని చేస్తూ జీవించేది. ఒంటరిగా ఉంటున్న తనకు, మనసుకి నచ్చే తోడు దొరక్కపోడా? అని వేచి చూసింది. ఈ క్రమంలోనే ఆమెకు రమేష్ అనే క్యాబ్ డ్రైవర్‌తో పరిచయం ఏర్పడింది. కొన్ని రోజుల తర్వాత అది ప్రేమగా మారింది. పెళ్లి చేసుకుంటానని రమేష్ మాటివ్వడంతో.. అతనితో సహజీవనం చేసేందుకు ఒప్పుకుంది.

Ladakh shut down: లడఖ్ లో సంపూర్ణ బంద్.. దలైలామాకు సంఘీభావంగా నిరసన..

అయితే.. రోజులు గడుస్తున్నా రమేష్ మాత్రం పెళ్లి ప్రస్తావన తీసుకురాలేదు. పైగా.. ఆమెను దూరం పెట్టడం మొదలుపెట్టాడు. పెళ్లి ఎప్పుడు చేసుకుందాం? అని ప్రశ్నించినప్పుడల్లా.. అతడు నిరాకరిస్తూ వచ్చాడు. దీంతో.. వీరిద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. రీసెంట్‌గా పెళ్లి విషయమై వీరి మధ్య మరోసారి గొడవ జరిగింది. అప్పుడు తన కోపం నషాళానికి ఎక్కడంతో.. రమేష్ కత్తి తీసుకొని సౌమ్యని నరికి చంపేశాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. సౌమ్య ఫోన్ రికార్డ్ ఆధారంగా, ఈ హత్య చేసింది రమేష్ అని గుర్తించి, అతడ్ని అరెస్ట్ చేశారు.

Show comments