NTV Telugu Site icon

Bangalore: స్నేహం ముసుగులో.. మహిళపై సామూహిక అత్యాచారం.. ముగ్గురు అరెస్టు

Gagn Rape

Gagn Rape

దేశంలో రోజు రోజుకు మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. స్నేహం, ప్రేమ, పెళ్లి పేరుతో వంచించి దారుణాలకు ఒడిగడుతున్నారు. మహిళల రక్షణ కోసం కఠిన చట్టాలను తీసుకొచ్చి అమలు చేస్తున్నప్పటికీ నేరాలకు అడ్డుకట్ట పడడం లేదు. బాలికలు, యువతులు, మహిళలపై లైంగిక దాడులకు పాల్పడుతున్నారు. నమ్మకం మాటునే మోసం దాగి ఉంటుందన్నది ఎంత నిజమో తాజాగా జరిగిన సంఘటనే నిదర్శనం. స్నేహం ముసుగులో ఓ మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు ముగ్గురు వ్యక్తులు. ఈ దారుణ ఘటన కర్ణాటక రాజధాని బెంగళూరులో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

Also Read:Vijayawada: యూట్యూబ్ ఛానల్ ముసుగులో స్పా సెంటర్ నిర్వాహణ.. 10 మంది మహిళలు అరెస్ట్

ఐటీ ప్రాంతమైన బెంగళూరులోని కోరమంగళ ప్రాంతంలో ఓ మహిళపై ముగ్గురు వ్యక్తులు హోటల్ టెర్రస్‌పై సామూహిక లైంగికదాడికి పాల్పడ్డారు. అనంతరం బాధిత మహిళ నుంచి డబ్బు, నగలు దోచుకుని అక్కడి నుంచి పరారయ్యారు. ఢిల్లీకి చెందిన బాధిత మహిళ ఉపాధి కోసం వచ్చి బెంగళూరులో ఉంటుంది. హోటల్స్ లో క్యాటరింగ్ పనులు చేస్తూ జీవిస్తోంది. ఈ క్రమంలో స్నేహితుడిని కలిసేందుకు గురువారం హోటల్‌కు వెళ్లింది. అక్కడ కాసేపు మాట్లాడుకున్న తర్వాత నిందితులు ఆమెను హోటల్ టెర్రస్ పైకి తీసుకెళ్లారు. అనంతరం సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. స్నేహితుడే ఆమెను హోటల్ కు రప్పించి ఈ దారుణానికి ఒడిగట్టినట్లు తెలిసింది.

Also Read:Gold Rates: కనకం… కనికరమే లేదా.. మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. నేడు తులం ఎతంటే?

బాధితురాలు ఎమర్జెన్సీ నంబర్ 112కు ఫోన్ చేసి చెప్పడంతో విషయం వెలుగు చూసింది. వెంటనే అలర్ట్ అయిన పోలీసులు నిందితుల కోసం గాలింపు చేపట్టారు. పశ్చిమ బెంగాల్‌, ఉత్తరాఖండ్‌కు చెందిన ముగ్గురు నిందితులు అజిత్, విశ్వాస్, శివులను అరెస్ట్ చేశారు. నిందితులు హెచ్ఎస్ఆర్ లే అవుట్‌లోని ఓ హోటల్‌లో పనిచేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. అత్యాచార ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు.