ఎన్నో ఆశలతో ప్రతి యువతి పెళ్లి చేసుకొంటుంది. భర్త, అత్తమామలు తోడుగా ఉంటారని, తన కుటుంబాన్ని వదిలి వస్తోంది. కానీ, అక్కడకి వచ్చాక భర్త, అత్తమామల వికృత రూపం బయటపడితే.. కట్నం కోసం చిత్రహింసలు పెడితే.. ఆ వేధింపులు తట్టుకోలేని వారు కొంతమంది ఆత్మహత్య చేసుకొని చనిపోతారు. మరికొందరు అలాంటివారిని పోలీసులకు అప్పజెప్పి జైలుకు పంపిస్తారు . తాజాగా మధ్యప్రదేశ్ లోని ఒక మహిళ భర్త వికృత చేష్టలను భరించలేక పోలీసులను ఆశ్రయించింది. తన భర్త, అత్తమామల నుంచి కాపాడాలని కోరింది.
వివరాల్లోకి వెళితే.. కొత్వాలి పరిధిలోని అరిహంత్ లో నివసించే పూజ అనే మహిళకు సూరజ్ జైన్ అనే వ్యక్తితో 2019 లో వివాహమైంది. ఎన్నో ఆశలతో పూజ కొత్త జీవితాన్ని అత్తవారింట్లో ప్రారంభించింది. అయితే పూజా ఆశలన్ని ఆడియాశలని తెలియడానికి ఎంతో సమయం పట్టలేదు. పెళ్లైన కొద్దిరోజులకే భర్త అసలు రూపమ్ చూపించడం మొదలుపెట్టాడు. అదనపు కట్నం కోసం పూజను చిత్ర హింసలు పెట్టడం మొదలుపెట్టాడు. కొడుకు తప్పు చేస్తే దండించాల్సిన తల్లిదండ్రులు కోడలిని ఇంకా ఎక్కువగా చిత్ర హింసలు పెట్టారు.అదనపు కట్నం తీసుకురాలేదని పూజకు ఇష్టం లేకుండా రెండు సార్లు అబార్షన్ చేయించారు.. అంతేకాకుండా నిత్యం కొడుతూ తొడల మధ్య వాతలు పెట్టారు. బయట ఎవరికి చూపించుకోలేని ప్రదేశాల్లో వాతలు పెట్టి నరకం చూపించారు. మూడేళ్లు ఈ కష్టాలను భరించిన పూజ తట్టుకోలేక పోలీసులను ఆశ్రయించింది. భర్తపై, అత్తామామామలపై కేసు పెట్టింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారం చేపట్టారు.
