Site icon NTV Telugu

Kolkata: కోల్‌కతాలో మరో అత్యాచార ఘటన.. ఐఐఎం క్యాంపస్‌లో విద్యార్థినిపై రేప్..

Kolkata

Kolkata

Kolkata: కోల్‌కతాలో మరో అత్యాచార సంఘటన వెలుగులోకి వచ్చింది. ఆర్జీకర్ మెడికల్ కాలేజ్ హత్యాచారం, కోల్‌కతా లా కాలేజ్‌లో విద్యార్థినిపై గ్యాంగ్ రేప్ ఘటనలు మరవక ముందే,ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్-కలకత్తాలో మరో అత్యాచార ఘటన వెలుగులోకి వచ్చింది. ఐఐఎంలో చదువుతున్న విద్యార్థినిపై క్యాంపస్ హస్టల్‌లో మరో విద్యార్థి అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులు శనివారం తెలిపారు.

Read Also: Ram Mohan Naidu: ఇప్పుడే ఏ నిర్ణయానికి రావద్దు.. ఎయిర్ ఇండియా క్రాష్‌పై రామ్మోహన్ నాయుడు..

హరిదేవ్ పూర్ పోలీస్ స్టేషన్‌లో మహిళ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. నిందితుడిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఐఐఎం-కలకత్తా బాయ్స్ హస్టల్‌లో ఈ సంఘటన శుక్రవారం జరిగిందని పోలీసులు చెప్పారు. కౌన్సిలింగ్ సెషన్ కోసం నిందితుడు, తనను హాస్టల్‌కి పిచినట్లు ఎఫ్ఐఆర్‌లో మహిళ పేర్కొంది. ఆ తర్వాత కూల్ డ్రింక్‌లో డ్రగ్స్ ఇచ్చి, తాను అపస్మారక స్థితిలోకి వెళ్లిన తర్వాత అత్యాచారం చేశాడని మహిళ ఫిర్యాదులో పేర్కొంది.

ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే తీవ్ర పరిణామాలు ఉంటాయని నిందితుడు మహిళను హెచ్చరించినట్లు విచారణలో తేలింది. నిందితుడైన స్టూడెంట్‌ను శుక్రవారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. తదుపరి విచారణ జరుగుతున్నట్లు పోలీసులు తెలిపారు. కోల్‌కతాలోని ఒక లా కాలేజీ లోపల ఒక విద్యార్థినిపై సామూహిక అత్యాచారం జరిగినట్లు ఆరోపణలు వచ్చిన దాదాపు పక్షం రోజుల తర్వాత ఈ పరిణామం జరిగింది.

Exit mobile version