అస్సాంలో దారుణం జరిగింది. అత్తమామలే బలవంతంగా కోడలికి యాసిడ్ తాగించి ఆమె మృతికి కారణమయ్యారని పోలీసులు గురువారం వెల్లడించారు. ఈ ఘటన అస్సాంలోని కరీంగంజ్ దిల్లా రతాబరీ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని భైరబ్‌నగర్ ప్రాంతంలో చోటుచేసుకుంది. భర్త, అత్తమామలు బలవంతంగా యాసిడ్ తాగించడంతో మహిళ చనిపోయిందని మృతురాలి కుటుంబసభ్యులు ఆరోపించారు. మృతురాలిని సుమ్నా బేగంగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటన తర్వాత నిందితుడు, మృతురాలి భర్త షకీల్ అహ్మద్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.
Godavari Floods: వరద కష్టాలు.. పడవలో వరుడి ఇంటికి పెళ్లికూతురు..
మృతురాలి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు.. గత కొన్ని రోజులుగా భర్త, అత్తమామలు ఆమెను శారీరకంగా, మానసికంగా హింసిస్తున్నారని కరీంగంజ్ జిల్లా పోలీసు సూపరిండెంట్ (ఎస్పీ) పద్మనాభ్ బారుహ్ వెల్లడించారు. మహిళను ఆసుపత్రికి తీసుకెళ్లగా.. అక్కడ ఆమె మరణించిందని ఆయమ పేర్కొన్నారు. మృతురాలి భర్తను అరెస్టు చేసి కేసు నమోదు చేశామని ఎస్పీ స్పష్టం చేశారు.
