Mobile Addiction Turns Fatal: భోజనం చేస్తూ రీల్స్ చూస్తుండగా.. పదేపదే నెట్వర్క్ ప్రాబ్లం.. మహిళ షాకింగ్ నిర్ణయం
- ఇంటర్నెట్ ఆగిపోయిందని తీవ్ర ఆగ్రహం
- చివరికి మహిళ మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mobile Addiction Turns Fatal: సోషల్ మీడియాలో రీల్స్ చూస్తుండగా పదేపదే ఇంటర్నెట్ అంతరాయాలు రావడంతో తీవ్ర ఆగ్రహానికి గురైన ఓ మహిళ పురుగుమందు తాగి ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన ఛత్తీస్‌గఢ్‌లోని కోర్బా జిల్లాలో చోటుచేసుకుంది. ఆమె భర్త వాంతి చేయించే ప్రయత్నంలో ఆవు పేడ నీళ్లు తాగించారు. ఆ తర్వాత ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆమె మరణించింది. మొబైల్ ఫోన్ వినియోగం, కోపాన్ని నియంత్రించుకోలేకపోవడం, మానసిక ఆరోగ్యంపై ఈ ఘటన మరోసారి చర్చకు దారితీసింది.
మంగ్లో బాయిగా గుర్తించబడిన ఆ మహిళ, తన ఫోన్లో రీల్స్ చూస్తూ భోజనం చేస్తుండగా ఇంటర్నెట్ కనెక్షన్ పదేపదే నిలిచిపోయినట్లు సమాచారం.
నెట్వర్క్ అంతరాయాలపై కోపంతో, మంగ్లో బాయి తన ఫోన్‌ను నేలకేసి కొట్టి, తన గదిలోకి వెళ్లి తలుపు గడియ పెట్టుకుంది. ఆ తర్వాత ఆమె పురుగుమందు తాగింది. కొంతసేపటికి పరిస్థితి మరింత విషమించి, వాంతులు చేసుకుంటూ గదిలోంచి బయటకు వచ్చింది. కుటుంబ సభ్యులకు పురుగుమందు వాసన రావడంతో ఆమె భర్త ప్రేమ్‌లాల్ వాంతులు చేయించడానికి ఆవు పేడ నీళ్ళు ఇచ్చాడు.
Also Read
- Instagram Love: ఇన్స్టాగ్రామ్ లవ్.. హిందు వివాహం.. భర్త ముస్లిం అని తెలిసి షాక్!
- Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
- Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
- Chhattisgarh: పెళ్లికి ‘నో’ చెప్పిందని 22 ఏళ్ల యువతిపై యాసిడ్ దాడి..
ఆ తర్వాత మొదట ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లారు, మహిళ పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో అక్కడి వైద్యులు మెరుగైన చికిత్స కోసం ఆమెను జిల్లా ఆసుపత్రికి రిఫర్ చేశారు. అక్కడ వైద్యులు చికిత్స అందించినప్పటికీ ఆమె ప్రాణాలను కాపాడలేకపోయారు. ఆరోగ్యం విషమించడంతో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. ఆసుపత్రి నుంచి అందిన మెమో ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!