Site icon NTV Telugu

ఆప్ ఎమ్మెల్యే దారుణం.. అర్ధరాత్రి తల్లీకూతుళ్లపై…

aap mla

aap mla

దేశ రాజధాని ఢిల్లీలో దారుణం చోటుచేసుకుంది. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న ఒక ఎమ్మెల్యే, తన అనుచరుల చేత ఇద్దరు మహిళలపై దాడి చేయించింది. తలపై ఇనప రాడ్లతో కొట్టించింది. నవంబర్ 19 న అర్ధరాత్రి కారులో దిగిన మహిళలపై కొంతమదని గుర్తు తెలియని దుండగులు దాడి చేశారు. ఆ దాడిలో తీవ్రంగా గాయపడిన తల్లీకూతుళ్లు గాయాల నుంచి కోలుకొని బుధవారం పోలీసులను ఆశ్రయించారు. దీంతో వెంటనే పోలీసులు విచారణ చేపట్టి సీసీ టీవీ ఫుటేజ్ ని పరిశీలించి నిందితుల కోసం వెతుకుతున్నట్లు తెలిపారు. అయితే ఆ నిందితులు మరెవ్వరో కాదని ఢిల్లీ ఆప్ ఎమ్మెల్యే బందన కుమారి అనుచరులని తెలుస్తోంది.

ఈ విషయాన్ని బాధితురాలు స్వయంగా తెలిపింది. “నేను బందన కుమారి, ఆమె భర్త చేసిన కొన్ని తప్పులు ఎత్తి చూపాను.. అది ఆమెకు నచ్చక నాపై దాడి చేయించింది. ఆరోజు రాత్రి నేను నాకూతురు కారులో వస్తుంటే కుమారి అనుచరులు నలుగురు పురుషులు, ఇద్దరు మహిళలు మమ్మల్ని కారు దిగిన వెంటనే ముట్టడించారు. కర్రలు, ఇనప రాడ్లతో మమ్మల్ని విచక్షణారహితంగా కొట్టారు.ఈ దాడిలో నేను , నా కూతురు తీవ్రంగా గాయపడ్డాము.. నవంబర్ 30 న మేము డిశ్చార్జ్ కాగానే వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశాం.. కానీ, నిందితులు ఎమ్మెల్యే అనుచరులు కావడంతో పోలీసులు సైతం వెనక్కి తగ్గుతున్నారని” వాపోయింది. ప్రస్తుతం ఈ ఘటన ఢిల్లీలో సంచలనం సృష్టిస్తోంది.

https://twitter.com/i/status/1465834833175711746
Exit mobile version