NTV Telugu Site icon

Extramarital Affair: ఓవైపు ఎఫైర్, మరోవైపు వరకట్న వేధింపులు.. చివరికి ఆ వివాహిత?

Extramarital Affair

Extramarital Affair

Woman Commits Suicide Due To Husband Affair And Domestic Harassment: తన భర్త మరో అమ్మాయితో వివాహేతర సంబంధం పెట్టుకోవడం, అత్తారింటి నుంచి వరకట్న వేధింపులు ఎక్కువ అవ్వడంతో.. ఓ వివాహిత మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాద ఘటన నిజామాబాద్‌లో చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే.. నిజామాబాద్‌కు చెందిన కావ్యశ్రీ(26)కి నవీపేటకు చెందిన ఎర్ర మనోజ్‌తో 2020లో వివాహం జరిగింది. మొదట్లో వీరి దాంపత్య జీవితం సజావుగానే సాగింది. తన భార్యపై మనోజ్ బాగానే ప్రేమ చూపించేవాడు. అయితే.. కొన్ని రోజులు గడిచిన తర్వాత అతడు కావ్యశ్రీని పట్టించుకోవడం మానేశాడు. తాను ఎంత ప్రేమగా ఉండాలని కావ్యశ్రీ ప్రయత్నించినా.. మనోజ్ అస్సలు పట్టించుకునేవాడే కాదు.

CV Anand: హెర్బల్ ప్రోడక్ట్స్ పేరుతో 7 వేల మందికి టోకరా.. రూ.200 కోట్లు ఢమాల్

తన భర్త ఎందుకిలా ప్రవర్తిస్తున్నాడని కావ్యశ్రీ ఆరాతీయగా.. అప్పుడు మనోజ్‌కి మరో అమ్మాయితో వివాహేతర సంబంధం ఉందని రివీల్ అయ్యింది. ఈ విషయం తెలిసిన వెంటనే మనోజ్‌ని కావ్యశ్రీ నిలదీయగా.. అతడు సరిగ్గా స్పందించలేదు. దీంతో.. ఈ విషయాన్ని ఆమె పెద్దల దృష్టికి తీసుకువెళ్లింది. పెద్దలందరూ ఇరువురికి సర్దిచెప్పి.. సరిగ్గా కాపురం చేసుకోవాలని సూచించారు. ఆ సమయంలో మనోజ్ ఓకే చెప్పాడు కానీ, మళ్లీ తన ప్రియురాలితో సన్నిహితంగా మెలగడం స్టార్ట్ చేశాడు. ఈ బాధ చాలదన్నట్టు.. కావ్యశ్రీని అదనపు కట్నం తీసుకుని రావాలంటూ మనోజ్ నిత్యం వేధించేవాడు. తనకు అప్పు ఉండటం వల్లే అతడు అదనపు కట్నం కోసం వేధించడం మొదలుపెట్టాడు. భర్తతో పాటు అత్తమామలు కూడా కావ్యశ్రీని వేధించసాగారు. దీంతో కావ్యశ్రీ మరింత కుంగిపోయింది. భర్త ఎఫైర్, అత్తారింటి వరకట్న వేధింపులు భరించలేక.. బుధవారం రాత్రి ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకొని, ఆత్మహత్యకు పాల్పడింది.

Jawan: మెంటలెక్కిస్తున్న జవాన్ క్రేజ్.. ట్రైల‌ర్ రిలీజ్ కాకుండానే అన్ని కోట్లా?

తమ కూతురు ఆత్మహత్య చేసుకుందన్న విషయం తెలిసి.. కావ్యశ్రీ తల్లిదండ్రులు బోరున విలపించారు. తన కూతురును అదనపు కట్నం కోసం వేధించడంతోనే, ఆత్మహత్యకు పాల్పడిందని మృతురాలి తండ్రి రాజేందర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు మేరకు వెంటనే రంగంలోకి దిగిన అధికారులు.. ఘటన స్థలానికి చేరుకొని, మృతదేహాన్ని పరిశీలించారు. భర్త మనోజ్‌, అత్తమామలైన అరుణ, మహేష్‌పై కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేపట్టారు.

Show comments