Site icon NTV Telugu

Woman Cooking Train: రైలులో మ్యాగీ వండిన మహిళ.. వీడియో వైరల్..

Untitled Design (5)

Untitled Design (5)

ఇండియన్ రైల్వేలో ఓ సంఘటన ప్రస్తుతం అందరిని ఆందోళనకు గురి చేస్తుంది. అయితే రైలులోని ఏసీ కోచ్ లో ఓ మహిళ ఎలక్ట్రిక్ కెటిల్ లో మ్యాగీ తయారు చేసింది. ఆమె మ్యాగీ తయారు చేసిన దృశ్యాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. వీడియో వైరల్ అవడంతో..రైల్వే అధికారులు ఆమెపై చర్యలు తీసుకున్నారు.

Read Also:Heart Attack: తెల్లవారుజామునే ఎక్కువగా గుండెపోటు ఎందుకు వస్తుందో మీకు తెలుసా..

పూర్తి వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్రకు చెందిన ఓ మహిళ రైలులో ఎలక్ట్రిక్ కెటిల్ ఉపయోగించి మ్యాగీ నూడుల్స్ వండింది. ఆమె మ్యాగీ వండిన దృశ్యాలను ఓ వ్యక్తి వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అయితే.. రైలులో ఎలక్ట్రిక్ స్టవ్ లు.. వేరే ప్రమాదకర వస్తువులు తీసుకెళ్లడం నిషేదం. అయినప్పటికి ఓ మహిళ ఎలక్ట్రిక్ కెటిల్ లో వండడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. ఇది సురక్షితం కాదని.. అగ్ని ప్రమాదాలకు కారణం అవుతుందని నెటిజన్లు మహిళపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. అయితే వీడియో వైరల్ అవడంతో రైల్వే అధికారులు ఆమెపై చర్యలు తీసుకున్నట్లు సమాచారం. ప్రయాణికులు ఎటువంటి ప్రమాదకరమైన వస్తువులను రైళ్లలో తీసుకెళ్లకూడదని.. ఒక వేళ అలా తీసుకు వచ్చిన వారికి శిక్ష పడుతుందని రైల్వే అధికారులు హెచ్చరిస్తున్నారు.

Exit mobile version