Site icon NTV Telugu

కొత్త ఇంట్లో నగ్నంగా పడిఉన్న డాన్సర్.. అసలేం జరిగింది..?

హైదరాబాద్ లో దారుణం చోటుచేసుకొంది. అనుమానాస్పద స్థితిలో ఒక డాన్సర్ మృతిచెందడం స్థానికంగా సంచలనంగా మారింది. ఫలక్‌ నుమా పరిధిలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ముస్తఫా నగర్ లో నివాసముంటున్న షరీఫ్ ఫాతిమా(30) ఆర్కెస్ట్రా గ్రూప్ లో డాన్సర్ గా పనిచేస్తోంది. ఇటీవలే భర్త చనిపోవడంతో తన పిల్లల్తో కలిసి నివసిస్తోంది. ఇక ఇటీవలే ఆమె ఫలక్‌ నుమా పరిధిలో కొత్త ఇల్లు కొనుగోలు చేసింది. ఇల్లు షిఫ్టింగ్ పనులు చూసుకోవడానికి పిల్లలను ఆమె తల్లి వద్ద వదిలి సోమవారం కొత్త ఇంటికి వచ్చింది. సాయంత్రమైన ఫాతిమా ఇంటికి రాకపోవడంతో భయపడిన ఆమె తల్లి ఆమెను వెతుక్కుంటూ కొత్తింటికి వెళ్లి చూడగా అర్ధనగ్నంగా, రక్తపు మడుగులో కూతురు కనిపించింది.

ఒక్కసారిగా ఆ ఘటనను చూసి షాకయ్యిన తల్లి వెంటనే పోలీసులకు సమాచారం అందించింది. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతదేహం పై బట్టలు లేకపోవడం,. పక్కనే బీరు బాటిల్స్ ఉండడంతో ఈ ఇంట్లో ఫాతిమాతో పాటు ఇంకా ఎవరో వచ్చి ఉంటారని, ఏదో విషయమై గొడవజరిగి ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అనుమాస్పద మృతి కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

Exit mobile version