Wife Took Revenge On Husband Who Have Affair With Another Woman: ఈమధ్య వివాహేతర సంబంధాలకు సంబంధించిన వ్యవహారాలు ఎక్కువగా వెలుగు చూస్తున్నాయి. తమకు తోడుగా మంచి పార్ట్‌నర్‌తో పాటు పిల్లలు ఉన్నప్పటికీ.. పరాయి వ్యక్తులపై మోజుతో కుటుంబాల్ని నాశనం చేసుకుంటున్నారు. తమ భాగస్వాముల్ని చిత్రహింసలకు గురి చేస్తున్నారు. కనీసం అలా చేసినా.. తమని వదిలేసి వెళ్లిపోతారని, అప్పుడు నచ్చిన వ్యక్తులతో ఉండొచ్చని భావిస్తున్నారు. ఓ వ్యక్తి కూడా అదే ఉద్దేశంతో తన భార్యని వేధించసాగాడు. అయితే.. ఆమె చాకచక్యంగా వ్యవహరించి, తన భర్తకే బుద్ధి చెప్పింది. పక్కా ప్లాన్ వేసుకొని.. రెడ్‌హ్యాండెడ్‌గా భర్తని పట్టుకొని.. తన రివేంజ్ తీర్చుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే..
Wasim Akram: ధోనీకి అతడే సరైన వారసుడు.. సీఎస్కే కెప్టెన్సీపై ఆసక్తికర వ్యాఖ్యలు
హైదరాబాద్‌లోని గాజులరామారం వల్లభాయ్‌నగర్‌కు చెందిన విజయ్‌కుమార్‌కు 16 సంవతత్సరాల క్రితం మెదక్ జిల్లాకు చెందిన స్వప్నతో వివాహమైంది. ఈ దంపతులకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. ముగ్గురు పిల్లలు పుట్టేంతవరకూ వీరి సంసార జీవితం సాఫీగానే సాగింది. ఎలాంటి విభేదాలు లేకుండా.. ఎంతో హాయిగా గడిపారు. అలాంటి వీరి కాపురంలో ఒక మహిళ ఎంట్రీ ఇచ్చాక.. చిచ్చు రగిలింది. మూడు సంవత్సరాల క్రితం.. విజయ్‌కు ఒక మహిళతో పరిచయం ఏర్పడగా, అది వివాహేతర సంబంధానికి దారి తీసింది. అప్పటి నుంచి విజయ్ తన భార్యకు టార్చర్ పెట్టడం మొదలుపెట్టాడు. తన భార్యను దూరం పెడుతూ.. విడాకులు ఇవ్వాలని వేధిస్తూ వచ్చాడు. కానీ.. స్వప్న మాత్రం విడాకులు ఇచ్చేందుకు ఒప్పుకోలేదు. తనతోనే కాపురం చేయాలని చెప్పింది. దీంతో.. విజయ్ ఆమెని మరింతగా వేధించడం ప్రారంభించాడు. క్రమంగా అతడు ఇంటికి రావడం కూడా మానేశాడు. కుటుంబ సభ్యులు ఫోన్లు చేసినా, స్పందించడం లేదు.
Brij Bhushan Issue: బ్రిజ్‌భూషణ్ వివాదం.. సాక్షితో ఫోటో వైరల్.. చిన్మయి స్ట్రాంగ్ కౌంటర్
కట్ చేస్తే.. శనివారం రాత్రి విజయ్ కుమార్ తన ప్రియురాలితో ఉన్నాడని స్వప్నకు తెలిసింది. ఇంకేముంది.. స్వప్న వెంటనే తన అక్కడు శ్యామల, మంజుల, బాబాయ్ శ్రీనివాస్‌ని తీసుకొని.. అతడున్న ప్రాంతానికి వెళ్లింది. తన భర్తని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకొని నిలదీసింది. ఈ క్రమంలో వారి మధ్య గొడవ జరిగింది. తన భార్యని విజయ్‌కుమార్ కొట్టబోతుండగా.. శ్రీనివాస్ అడ్డుకున్నాడు. అప్పుడు విజయ్ ఆయనపై కత్తితో దాడి చేయగా.. శ్రీనివాస్ మెడ, చేతిపై తీవ్ర గాయాలయ్యాయి. దాంతో.. ఆయన్ను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. మరోవైపు.. ఆదివారం స్వప్న తన భర్త వివాహేతర సంబంధంపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు.. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
