Site icon NTV Telugu

Karnataka: ప్రియుడి మోజులో పడి భర్తకు అన్నంలో విషం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..?

Karnataka

Karnataka

Karnataka: ప్రియుడి మోజులో పడిన ఓ వివాహిత తన భర్త కుటుంబాన్ని అంతం చేయాలని ప్లాన్ చేయగా.. అది కాస్త బెడిసి కొట్టింది. భర్త అలర్ట్ కావడంతో ఆ ఫ్యామిలీ బతికి బట్ట కట్టింది. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలోని హాసన్‌ జిల్లా బేలూరు తాలూకా కెరళూరు గ్రామంలో జరిగింది. కెరళూరు గ్రామానికి చెందిన గజేంద్ర అనే వ్యక్తికి 11 ఏళ్ల క్రితం చైత్ర అనే యువతితో పెళ్లైంది. ఈ దంపతులకు ఇద్దరు మగ పిల్లలు కూడా ఉన్నారు. ఇక, అత్తమామలతో కలిసి జీవనం కొనసాగిస్తున్నారు. కాగా, మూడేళ్లుగా పునీత్‌ అనే యువకుడితో చైత్ర సన్నిహితంగా ఉంటుంది.

Read Also: India vs America: అమెరికా 10 శాతం సుంకాన్ని తగ్గించాలి.. ట్రంప్ ముందు భారత్ డిమాండ్

ఈ విషయం, భర్త గజేంద్ర, అత్తమామలకు తెలిసింది. పెద్దలు పంచాయితీ చేసి రాజీ కూడా కుదిర్చారు. కొన్ని రోజులు దంపతులు అన్యోన్యంగా కలిసి ఉన్నప్పటికీ చైత్ర మరోసారి శివ అనే మరో యువకుడితో అక్రమ సంబంధం పెట్టుకుంది. ఇక, భర్త, అత్తమామలను అడ్డు తొలగించుకోవాలని అనుకుంది.. భోజనంలో విషం కలిపింది.. చైత్ర ప్రవర్తనలో తేడాను గమనించిన భర్త గజేంద్ర ప్రమాదాన్ని ముందుగానే పసిగట్టాడు. అన్నంలో విషం కలిపినట్లు తెలుసుకొని బేలూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు చైత్రను అరెస్టు చేసి ఎంక్వైరీ చేస్తున్నారు.

Exit mobile version