Murder: బెలగావి జిల్లా రామదుర్గ తాలూకాలోని ఖాన్‌పేట్ సమీపంలో జూలై 7న ఒక వ్యక్తి దారుణంగా హత్య చేయబడిన స్థితిలో మృతదేహం గుర్తించబడింది. మెడకు టవల్‌తో బిగించి, మర్మాంగంపై దాడి చేసి, తలపై కండరంతో కొట్టి దారుణంగా హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. హత్యపై కేసు నమోదు చేసిన రామదుర్గ పోలీసులు, మృతుడిని ధారవాడ అమ్మినబావి గ్రామానికి చెందిన ఈరప్ప ఆడిన్‌గా గుర్తించారు. కేసును లోతుగా విచారించగా, హత్య వెనుక హృదయాన్ని కలచివేసే కుటుంబ రహస్యాలు వెలుగులోకి వచ్చాయి.
ఈరప్పకు కమలవ్వతో 11 సంవత్సరాలు క్రితం పెళ్లి అయ్యింది. అయితే.. గత కొంత కాలంగా వివాహ బంధం గొడవలతో నిండిపోయింది. కమలవ్వ ధారవాడలో ఓ హోటల్‌లో పనిచేస్తుండగా, ఆమె సంపాదించిన డబ్బుతో ఈరప్ప మద్యం సేవించేవాడు. నిత్యం మద్యం మత్తులో పడి భార్యను వేధించేవాడు. ఈ నేపథ్యంలో కమలవ్వకు రెండు సంవత్సరాల క్రితం సాబప్ప అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. కొద్ది రోజులకే ఆ పరిచయం కాస్త వివాహేతర సంబంధంగా మారింది. ఈరప్ప నుంచి విముక్తి కావాలని నిర్ణయించుకున్న కమలవ్వ, ప్రియుడైన సాబప్పను తన భర్తను హత్య చేయమని ఒత్తిడి చేయడం ప్రారంభించింది.
US-Russia: ట్రంప్ డెడ్‌లైన్‌లు పట్టించుకోం.. రష్యా సీనియర్ అధికారి వెల్లడి
ఒకే రోజు సాబప్పకు 30 సార్లు ఫోన్ చేసి, “హత్య చేయకపోతే నేను విషం తాగి చనిపోతాను” అని బెదిరింపులు కూడా ఇచ్చిందట. చివరికి కమలవ్వ, సాబప్ప, అతని మిత్రుడు ఫకీరప్ప కలిసి అమ్మినబావికి వచ్చారు. బార్‌లో మద్యం తాగుతున్న ఈరప్పను మత్తులో ముంచి, బైక్‌పై ఖాన్‌పేట్‌కు తీసుకెళ్లి నిశ్శబ్ద ప్రాంతంలో ఘోరంగా హత్య చేశారు.
హత్య చేసిన అనంతరం నలుగురూ మునవల్లికి వెళ్లి పార్టీ చేసుకున్నారు. పోలీసులు తమ నిఘా ద్వారా విచారణ చేపట్టి, సాంకేతిక ఆధారాలతో నిందితులను గుర్తించారు. కమలవ్వ భర్త హత్యలో నేరుగా పాత్ర పోషించిందని విచారణలో తేలింది. హత్య అనంతరం ఆమె బిందాస్‌గా వ్యవహరించడమే అధికారులకు అనుమానాన్ని కలిగించింది. ఈ హత్య కేసులో అధికారులు స్పందించి ముగ్గురు నిందితులను అరెస్టు చేసి జైలుకు తరలించారు. ఈ ఘటనపై రామదుర్గ పోలీస్‌స్టేషన్ కేసు దర్యాప్తు కొనసాగుతోంది. భర్తను ప్రేమికుడితో కలిసి హత్య చేయించుకున్న భార్య చర్యలు, నేర ప్రపంచంలో పరాకాష్టకు చేరినదిగా పోలీసులు వ్యాఖ్యానించారు.
Pune Porsche Crash: నిందితుడు టీనేజర్ కాదు.. మైనరే.. పోలీసుల వాదన తోసిపుచ్చిన జువైనెల్ బోర్డు
