మేడ్చల్ జిల్లాలో దారుణం చోటుచేసుకొంది. ప్రియుడితో కలిసి ఓ భార్య, తన భర్తను అతికిరాతకంగా హత్య చేసింది. హత్యను ఆత్మహత్యగా నమ్మించేందుకు ప్రయత్నించి చివరికి పోలీసులకు అడ్డంగా బుక్కయ్యారు. వివరాల్లోకి వెళితే.. అక్బర్జాపేట్ గ్రామానికి చెందిన మహంకాళి కృష్ణ, మహంకాళి లక్ష్మీ భార్యాభర్తలు. 2014 లో గుంటి బాలరాజ్ అనే వ్యక్తితో కలిసి కృష్ణ ఒక ఆటో కొనుగోలు చేసి నడుపుతున్నారు. అప్పటినుంచి బాలరాజ్ కన్ను మహంకాళి లక్ష్మీపై పడింది. కొన్నిరోజుల్లో ఆమె కూడా బాలరాజ్ పై మోజుపడడంతో ఇద్దరి మధ్య వివాహేతర సంబంధం కొనసాగుతోంది.
భర్త ఇంట్లో లేనప్పుడు వారిద్దరూ శారీరకంగా కలుస్తుండేవారు. అయితే ఇటీవల భర్త ఇంట్లో గాఢనిద్రలో ఉన్నప్పుడు ప్రియుడిని ఇంటికి పిలిచి కామక్రీడల్లో మునిగితేలింది. ఆ శృంగార శబ్దాలకు భర్తకు మెలుకువ వచ్చి చూడగా.. భార్య మరొకరితో నగ్నంగా కనిపించింది. ఇక ఈ అనుకోని సంఘటనకు షాక్ అయినా కృష్ణ భార్యపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. భర్తకు విషయం తెలిసిపోవడంతో ఎలాగైనా అతనిని మట్టుబెట్టాలని భార్య, ప్రియుడు అనుకోని భర్తను గొంతునులిమి హత్యచేశారు. ఉదయం తాగడానికి కల్లు దొరకక ఆత్మహత్య చేసుకున్నాడని బంధువులను నమ్మించారు. అయితే ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు తమదైన రీతిలో విచారించగా అస్సలు నిజాలు బయటపడ్డాయి. నిందితురాలు లక్ష్మీని, అతని ప్రియుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
