వివాహేతర సంబంధాలు పచ్చని కాపురాలలో చిచ్చు పెడుతున్నాయి. ఇంట్లో కట్టుకున్నవారిని, కన్నవారిని కాదనుకొని పరాయివారి మోజులో పడి, జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. పరాయి వారితో శృంగారానికి అలవాటు పడి .. కట్టుకున్నవారిని కడతేరుస్తున్నారు. తాజాగా ఒక భార్య.. ప్రియుడి మోజులో భర్తను అతిదారుణంగా హత్య చేసింది.. ఆ హత్యను, ఆత్మహత్యగా తీర్చిదిద్ది అందరిని నమ్మించాలని చూసింది. కానీ, చివరికి ఆమె ఏడేళ్ల కూతురు సాక్ష్యం తల్లిని, ప్రియుడిని జైలుకు పంపింది. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్ లో వెలుగుచూసింది.
వివరాల్లోకి వెళితే.. మెయిన్‌పురికి చెందిన మనోజ్ అనే వ్యక్తికి కొన్నేళ్ల క్రితం ఖుష్బూతో వివాహమైంది. వారికి ఏడేళ్ల కూతురు ఉంది. అనోన్యంగా ఉండే ఆ జంట మధ్యలోకి అభిషేక్ మిశ్రా అనే యువకుడు ప్రవేశించాడు. ఖుష్బూ, అభిషేక్ తో వివాహేతర సంబంధం పెట్టుకుంది. భర్త ఇంట్లో లేనప్పుడు ఇంటికి పిలిపించుకొని రాసలీలలు కొనసాగించేవారు . ఇటీవల వీరి బాగోతం భర్తకు తెలియడంతో భార్యను హెచ్చరించాడు. దీంతో ప్రియుడిని కలుసుకోవడం ఇబ్బంది అవుతుందని ఎలాగైనా భర్తను తప్పించాలని ప్లాన్ వేసింది. వెంటనే ప్రియుడితో కలిసి స్కెచ్ రెడీ చేసింది. బుధవారం అర్ధరాత్రి ప్రియుడిని ఇంటికి పిలిచి, ఇద్దరు కలిసిమనోజ్ గొంతు నులిమి హత్య చేశారు.
అనంతరం అతడిని ఫ్యాన్ కి ఉరి వేసి ఆత్మహత్యగా క్రియేట్ చేశారు. ఉదయం ఏం ఎరగని దానిలా నా భర్త మమ్మల్ని వదిలిపోయాడు అంటూ ఏడుపు లంకించుకొంది . ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మనోజ్ ది ఆత్మహత్య కాదని, హత్యేనని నిర్దారింఛి విచారణ మొదలుపెట్టారు. విచారణలో పోలీసులు వారి ఏడేళ్ల కూతుర్ని ప్రశ్నించగా.. తన తల్లి, మరొక వ్యక్తితో కలిసి తండ్రిని గొంతు నులిమి చంపిందని, తండ్రి ఎంతగా బతిమిలాడినా వినిపించుకోలేదని, ఈ విషయం ఎవరికైనా చెప్తే తనను కూడా చంపేస్తానని బెదిరించినట్లు తెలిపింది. బాలిక సాక్ష్యంతో తల్లిని, ప్రియుడిని పోలీసులు అరెస్ట్ చేసి కోర్టుకు తరలించారు.
