NTV Telugu Site icon

Teacher Killed: వీడిన మిస్టరీ.. తమ్ముడితో కలిసి భార్య ఆ పని..

Wife Killed Husband

Wife Killed Husband

గత నెల 14వ తేదీన జరిగిన ఉపాధ్యాయుడి హత్య కేసు మిస్టరీ వీడింది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడన్న నెపంతో భార్యే ఈ దారుణానికి పాల్పడింది. ఆమె తమ్ముడు కూడా ఇందుకు సహకరించడం మరో షాకింగ్ విషయం. ఆ కేసు వివరాల్లోకి వెళ్తే..

నంద్యాల జిల్లా పాణ్యంకు చెందిన షేక్‌ జవహర్‌ హుసేన్‌.. బనగానపల్లె మండలం చెరువుపల్లె ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాడు. ఇతనికి కొన్ని సంవత్సరాల క్రితం షేక్ హసీనాతో వివాహమైంది. వీరికి తమీమ్, ఆర్పియా అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. అంతా సజావుగా సాగుతోందనుకుంటున్న వీరి సంసార జీవితంలోకి మహబూబ్ బాషా అనే వ్యక్తి వచ్చాడు. అతనితో హసీనా వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయం తెలిసిన హేసేన్.. పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టించాడు. గ్రామ పెద్దలు మహబూబ్ బాషాను మందలించి, గ్రామం నుంచి హుసేనాపురం పంపించారు.

అయినా.. హసీనా, మహబూబ్‌బాషాల తీరు మారలేదు. తరచూ ఫోన్‌లో మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. ఇది గమనించిన హుసేన్.. భార్యను వేధించాడు. దీంతో, భర్తను అడ్డు తొలగించుకోవాలని హసీనా నిర్ణయించుకుంది. తన తమ్ముడు ఇద్రూస్, ప్రియుడు మహబూబ్‌బాషాతో కలసి కుట్ర పన్నింది. ఇందులో భాగంగా ఇద్దరు పిల్లల్ని తన తల్లి ఇంటికి పంపించింది. గత నెల 13వ తేదీన హుసేన్ ఇస్తమాకు వెళ్లి, రాత్రి 10 గంటలకు ఇంటికి వచ్చాడు. అప్పటికే ఇంటిపైన ఇద్రూస్, మహబూబ్ బాషా ఉన్నారు. హుసేన్ నిద్రలోకి జారుకోగా.. ముగ్గురు కలిసి అతని గొంతునొక్కి చంపేశారు.

ఆ తర్వాత అనుమానం రాకుండా హుసేన్ ఆస్తమాతో ఊపిరాడక చనిపోయాడని హసీనా సమాచారం ఇచ్చింది. వైద్యులు కూడా అతడు ఊపిరాడక పోవడం వల్లే చనిపోయాడని ధృవీకరించారు. అయితే.. తన అన్నకు ఆస్తమా ఉన్నా, మందులు సక్రమంగా వాడుతున్నాడని, ఆ సమస్యతో అతను చనిపోలేదని, ఇతర కారణాలున్నాయన్న అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. పోస్టుమార్టం నివేదిక మేరకు దర్యాప్తు చేయగా, తమ్ముడు & ప్రియుడతో కలిసి భార్యే హుసేన్‌ను చంపినట్టు తేల్చారు.