సాధారణంగా పెద్దవారు ఒక మాట చెప్తూ ఉంటారు.. మహిళ ఏదైనా తట్టుకుంటుందేమో కానీ తన భర్తను వేరొకరితో పంచుకోవడం మాత్రం తట్టుకోలేదని.. అయితే ఇది కొంత వరకు నిజమే.. తనకు మాత్రమే పంచాల్సిన ప్రేమను భర్త వేరొకరికి పంచుతుంటే భార్యకు కోపం రావడం సహజం.. అయితే ఆ కోపంలో ఎంత నీచానికైనా దిగజారడం నేరం. తాజాగా ఒక భార్య, తన భర్త వేరొక యువతితో సంబంధం పెట్టుకున్నాడన్న అనుమానంతో దారుణానికి పాల్పడింది. భర్త మాట్లాడుతున్న అమ్మాయిని ఇంటికి పిలిచి ఆమె వద్దకు నలుగురు అబ్బాయిలను పంపి అత్యాచారానికి ఉసిగొల్పింది. అంతేకాకుండా ఆమె ప్రైవేట్ భాగాల్లో గాయాలు చేసి అతి కిరాతకంగా ప్రవర్తించి మహిళ అన్న మాటకే మాయని మచ్చగా మారింది. ఈ దారుణ ఘటన శ్రీకాకుళంలో వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళితే.. శ్రీకాకుళంకు చెందిన శ్రీకాంత్, గాయత్రి భార్యాభర్తలు హైదరాబాద్ లోని గచ్చిబౌలి పరిసర ప్రాంతంలోని ఒక కాలనీలో నివాసముంటున్నారు.. పెళ్లైన దగ్గరనుంచి అన్యోన్యంగా ఉండే ఈ జంట అంటే కాలనీలో అందరికి మంచి పేరు ఉంది. ఇక ఈ నేపథ్యంలోనే కొన్ని రోజుల క్రితం ఒక యువతి ఆ కాలనిలో అడుగుపెట్టింది. సివిల్స్ ప్రిపేర్ అవుతున్న ఆమె.. శ్రీకాంత్ కు పరిచయమయ్యింది. అప్పుడప్పుడు రోడ్డు మీద వీరు మాట్లాడుకునేవారు. ఇక వీరిద్దరిని గాయత్రీ చూడడం, భర్తపై అనుమానం పెంచుకోవడం చకచకా జరిగిపోయాయి. ఇక దీంతో భర్తను తన వలలో వేసుకున్న యువతిపై గాయత్రీ కక్ష కట్టింది. ఎలాగైనా ఆమెను భర్త నుంచి వేరుచేయాలని ప్లాన్ వేసింది. ఇటీవలే ఆమెను ఎంతో ఆప్యాయంగా ఇంటికి రమ్మని పిలిచింది. గాయత్రీ ప్లాన్ తెలియని యువతి ఆప్యాయంగా పిలిచిందని ఆమెతో పాటు వెళ్ళింది. అంతే.. ఆ యువతి లోపలి రావడంతో గాయత్రీ.. ఆమె కాళ్ళు చేతులు కట్టి ఒక మూలాన పడేసింది. ఆమె దగ్గరకు నాలుగు యువకులను పంపి అత్యాచారం చేయించడానికి ప్రయత్నించింది. తన భర్తతోనే సంబంధం పెట్టుకుంటావా అని యువతి బట్టలు విప్పి ఆమె ప్రైవేట్ భాగంలో యువకుల చేత పదునైన ఆయుధాలతో, రాడ్ దింపి గాయాలు చేయించింది.. ఆ ఘటనను అంతా వీడియో తీసి.. ఈ విషయాన్ని ఎక్కడైనా చెప్తే వీడియోను సోషల్ మీడియా లో షేర్ చేస్తానని బెదిరించి బయటికి గెంటేసింది. ఇక ఆ గాయాలతో యువతి పోలీస్ స్టేషన్ కు చేరుకొని ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు గాయత్రి తో పాటు నలుగురు యువకులను అరెస్ట్ చేశారు. ప్రస్తుతం కేసు విచారణలో ఉందని పోలీసులు తెలుపుతున్నారు.