Sangareddy Crime: ఆస్తి కోసం ఐదు రోజులు ఆస్పత్రిలోనే శవం ఘటన సంగారెడ్డి జిల్లాలో సదాశివపేట (మం) తంగేడుపల్లిలో సంచలనం సృష్టించింది. ఆస్తి ఇచ్చేంత వరకు భర్త అంత్య క్రియలు జరిపేది లేదని తేల్చి చెప్పింది. దీంతో ఈ ఘటన సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. దీనిపై మృతుడు రాములు భార్య మాట్లాడుతూ.. నా భర్త చనిపోలేదు అత్తమామ, ఆడపడుచు, ఆమె భర్త చంపేశారని ఆరోపించింది. నా భర్త బతికినన్ని రోజులు ఆస్తిలో వాటా కోసమే పోరాడేవాడని తెలిపింది. నా భర్త ఆఖరి కోరిక మేరకే ఐదు రోజుల పాటు అంత్యక్రియలు ఆపాల్సి వచ్చిందని తెలిపింది. గతంలో భూమి కోసం తను, నా భర్త ఆత్మహత్యాయత్నం చేశామని గుర్తు చేసింది. బతికి ఉన్నప్పుడు, చనిపోయాక రెండు సార్లు ఆస్తిలో వాటా ఇస్తామని మోసం చేశారని ఆరోపించింది. ఆడపడుచు భర్త మల్లేశం హోంగార్డుగా పని చేస్తుండటంతో అతనికే పోలీసులు సహకరిస్తున్నారని సంచలన ఆరోపణలు చేసింది. నా భర్త కోరిక మేరకే ఆస్థికోసం మృత దేహాన్ని ఇన్ని రోజులు అలాగే ఉంచాల్సి వచ్చిందని తెలిపింది. ఆస్తి ఇచ్చేంత వరకు వదిలే ప్రశక్తే లేదని పేర్కొంది. ఇప్పటికైనా తన భర్త ఆస్థిని ఇచ్చేయాలని తెలిపింది. తల్లిదండ్రులు ఆస్తిని మొత్తం తన బావ పేరుపై రిజిస్ట్రేషన్ చేశారని మనస్తాపంతో ఈ నెల 18న భర్త రాములు ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే.
KTR Legal Notice: వారం రోజుల్లో క్షమాపణలు చెప్పాలి.. బండి సంజయ్ కి కేటీఆర్ లీగల్ నోటీసు..
Sangareddy Crime: నా భర్త చివరి కోరిక మేరకే అంత్యక్రియలు ఆపాను: మృతుడి భార్య..
- ఆస్తి కోసం ఐదు రోజులు ఆస్పత్రిలోనే శవం ఘటన..
- సంగారెడ్డి జిల్లాలో సంచలనం సృష్టించింది..
- ఈ ఘటన సోషల్ మీడియాలో సంచలనంగా మారింది..
- దీనిపై మృతిని భార్య స్పందించింది..
- తన భర్త చివరి కోరికమేరకే అంత్యక్రియలు చేయలేదని తెలిపింది..