అక్రమ సంబంధాల కారణంగా ఎన్నో జీవితాలు నాశనం అయ్యాయి, ఎందరో ప్రాణాలు బలి అయ్యాయి, ఎన్నో కుటుంబాల పరువు రోడ్డున పడ్డాయి. అయినా జనాల్లో మార్పు రావడం లేదు. కేవలం ఐదు నిమిషాల తృప్తి కోసం పరాయి వ్యక్తులతో ఎఫైర్స్ పెట్టుకుంటున్నారు. ఇలాంటి అక్రమ బంధాల వల్ల కలిగే నష్టాలు తెలిసి కూడా అడ్డదారుల్లోనే వెళ్తున్నారు. ఇలాగే ఓ భర్త అడ్డదారి తొక్కినందుకు, భార్య అతని పరువు బజారుకీడ్చింది. ప్రేయసి సహా అతడ్ని కూడా నగ్నంగా ఊరేగించింది. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్‌లోని కొండాగావ్‌లో చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే..
స్థానికంగా నివాసముంటోన్న ఓ వ్యక్తి (25).. మరో యువతితో వివాహేతర సంబంధం నడుపుతున్నాడు. కొంతకాలం నుంచి ఎవ్వరికీ తెలియకుండా, ఆ జంట తమ ఎఫైర్ తంతు కొనసాగిస్తోంది. భార్యకు ఈ విషయం తెలియగా.. భర్తను మందలించింది. అటు, ఆ యువతికి కూడా వార్నింగ్ ఇచ్చింది. అయినా వారిలో మార్పు రాలేదు. చాటుగా కలుస్తూనే ఉన్నారు. దీంతో, ఎలాగైనా వీరిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకోవాలని భార్య భావించింది. ఇందుకు ఓ పన్నాగం పన్నింది. శనివారం ఊరికెళ్తానని భర్తకు అబద్ధం చెప్పింది. దీంతో, అతడు భార్య ఊరేళ్లిందనుకొని, తన ప్రియురాల్ని ఇంటికి పిలిపించాడు. ఇద్దరు రొమాన్స్‌లో మునిగితేలారు.
అప్పుడు భార్య ఇంటికి తిరిగొచ్చింది. ఇంకేముంది, ప్లాన్ ప్రకారం ఇద్దరూ అడ్డంగా దొరికిపోయారు. దీంతో, చుట్టుపక్కల వాళ్ల సాయంతో వారిని నగ్నంగానే బయటకు ఈడ్చుకొచ్చింది. ఆపై గ్రామపెద్దల సహకారంతో వారిని నగ్నంగా ఊరేగించింది. ఈ ఘటన జూన్ 11న జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియోలు వాట్సప్‌లో వైరల్ అవ్వడంతో, పోలీసులు రంగంలోకి దిగారు. ఘటనకు సంబంధించి వివరాల్ని సేకరించడంతో బాధితుల స్టేట్మెంట్ ప్రకారం ఫిర్యాదు నమోదు చేశారు. ఆపై.. ఎఫైర్ పెట్టుకున్న వ్యక్తితో పాటు మరో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు.
