NTV Telugu Site icon

Crime: ఆ పనిచేస్తున్నాడని భర్త మర్మాంగంపై దాడి చేసిన భార్య.. దాన్ని పోసి

Chennai

Chennai

Crime: ప్రతి మనిషికి ప్రేమ, కోపం,ద్వేషం తో పాటు సహనం కూడా ఉంటుంది. ముఖ్యంగా ఆవిడవారికి సహనం ఎక్కువ ఉంటుందని ఆమెను భూమాత తో పోలుస్తూ ఉంటారు. అయితే ఆమె సహనం కోల్పోతే ఎలా ఉంటుంది అనేది అందరికి తెల్సిందే. కాళీమాత ఉగ్ర రూపం చూపిస్తే ఎలా ఉంటుందో ఒక మహిళ సహనం కోల్పోతే అలాగే ఉంటుంది అంటారు పెద్దలు. తాజాగా భర్త పెట్టే నరకాన్ని అనుభవించి, అనుభవించి ఒక మహిళ సహనాన్ని కోల్పోయింది. ఆ బాధలు భరించలేక ఒక సంచలన నిర్ణయం తీసుకొంది. భర్తకు తగిన శిక్ష విధించాలనుకొంది. వేడి నీటిని భర్త మర్మాంగంపై పోసి కసితీరా కోపాన్ని తీర్చుకున్నది. ఆ తరువాత చేసిన తప్పును ఒప్పుకొని పోలీసులకు లొంగిపోయింది. ఈ ఘటన చెన్నైలో వెలుగుచూసింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాణిపేట జిల్లా కావేరిపాక్కం కి చెందిన తంగరాజ్ అనే వ్యక్తికి ప్రియ అనే మహిళతో కొన్నేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు. పెళ్లి తరువాత కొన్ని రోజులు బాగానే ఉన్న తంగరాజ్ ఆ తరువాత మృగంలా మారిపోయాడు. నిత్యం భార్యను అనుమానిస్తూ కొట్టడం, తిట్టడం చేస్తుండేవాడు. భర్తను మార్చుకోవాలని ప్రయత్నించినా ప్రియ వలన కాలేదు. ఇక ఇటీవలే భర్త ఎందుకు ఇలా తయారయ్యాడో తెల్సుకొని షాకయ్యింది ప్రియ. వేరొక యువతితో భర్త సంబంధం పెట్టుకొని తనను వేధిస్తున్నాడని తెలుసుకున్న ఆమెకు కోపం కట్టలు తెంచుకోంది. తనకు నరకం చూపించిన భర్తకు తగిన శిక్ష వేయాలని భావించిన ఆమె మంగళవారం ఇంట్లో పడుకున్న భర్త మర్మాంగంపై మరుగుతున్న నీటిని కుమ్మరించింది. ఆ బాధను తట్టుకోలేక తంగరాజ్ అరుస్తుండడంతో తిరిగి ఆమెనే భర్తను ఆసుపత్రిలో చేర్పించి.. సరాసరి పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయింది. తన భర్త వేధింపులకు గురిచేస్తూ నరకం చూపిస్తున్నాడని, అందుకే అతనికి శిక్ష వేశానని పోలీసులకు తెలిపింది. ఇక మరోపక్క తంగరాజ్ దేహం 40 శాతం కాలిపోయిందని, మెరుగైన చికిత్స కోసం అతడిని వేలూరు ఆసుపత్రికి తరలించినట్లు వైద్యులు తెలిపారు. ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రియను అరెస్ట్ చేశారు.