రోజురోజుకు వివాహేతర సంబంధాలు పెరిగిపోతున్నాయి. వావి వరస లేకుండా కొందరు రెచ్చిపోతున్నారు. భార్యను వదిలేసి కొందరు భర్తలు వివాహేతర సంబంధాలు పెట్టుకున్నారు. కొందరు మహిళలు భర్త ఉన్నప్పటికి వేరే వ్యక్తితో అక్రమ సంబంధం కొనసాగిస్తున్నారు. అడ్డుగా భర్తను.. పిల్లలను చంపేందుకు కూడా వెనకాడడంలేదు. అయితే ఇలాంటి ఘటనే ఒకటి మహారాష్ట్రలో చోటుచేసుకుంది. మరిది సంబంధం పెట్టుకున్న భార్య.. భర్తను గొడ్డలితో నరికి చంపేంసింది. ఈ ఘటన స్థానికండా కలకలం రేపింది.
Read Also: Verizon to Lay Off: 15వేల మంది ఉద్యోగులను తొలగించనున్న వెరిజోన్ టెలికాం కంపెనీ..
పూర్తి వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్రలోని జల్నా జిల్లా సోమ్తానాలో దారుణం చోటుచేసుకుంది. మరిదితో ఎఫైర్ పెట్టుకున్న భార్య కట్టుకున్న భర్తనే కడతేర్చింది. సోమ్తానా గ్రామానికి చెందిన పరమేశ్వర్ రామ్ టేడేగా, మనీషా భార్యాభర్తలు. వీరితో పాటు టేడే తమ్ముడైన జ్ఞానేశ్వర్ తో కలిసి ఉండేవాడు. అయితే ఈ క్రమంలో . అతని భార్య మనీషా, తమ్ముడు జ్ఞానేశ్వర్ మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయం టేడే కు తెలిసి భార్యను మందలించాడు.
Read Also:Avocado vs Amla: అవకాడో వర్సెస్ ఉసిరి.. ఈ రెండింటిలో దేనితో ఎక్కువ లాభాలున్నాయంటే..
మనీషా.. జ్ఞానేశ్వర్ మధ్య వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భావించి.. టేడేను చంపేందుకు కుట్ర పన్నారు. అనుకున్న విధంగా గొడ్డలితో పరమేశ్వర్ రామ్ టేడేగాను తమ్ముడు జ్ఞానేశ్వర్ తో కలిసి గొడ్డలితో నరికి చంపింది. అనంతరం డెడ్ బాడీని ఓ గోనే సంచిలో చుట్టి వాలా-సోమ్తానా చెరువులో పడేశారు. అనంతరం వారు అక్కడి నుంచి పారిపోయారు. చెరువులో తేలుతున్న మృత దేహాన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృత దేహాన్ని పోస్ట్ మార్టంకు తరలించి.. అనంతరం తప్పించుకున్న నిందితులను పట్టుకుని విచారణ చేపట్టారు. విచారణలో పరమేశ్వర్ రామ్ టేడేను గొడ్డలితో నరికి చంపినట్లు మనీషా, జ్ఞానేశ్వర్ ఒప్పుకున్నట్లు పోలీసులు తెలిపారు. అనంతరం నిందితులను రిమాండ్ కు తరలించారు పోలీసులు.
