NTV Telugu Site icon

Madhya Pradesh: “మీ చెల్లికి నిప్పంటించాం”.. సోదరుడికి అత్తమామల ఇంటి నుంచి ఫోన్..

Madhyapradesh

Madhyapradesh

Madhya Pradesh: మధ్యప్రదేశ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. తన సోదరుడి మరణానికి అతని భార్యే కారణమని పగ పెంచుకున్న వ్యక్తి ఆమెకు నిప్పటించి చంపాడు. ఈ ఘటన రత్లాం జిల్లాలో జరిగింది. కుటుంబ కలహాల నేపథ్యంలో అత్తామామలు, ఆమె బావ మహిళపై పెట్రోల్ పోసి నిప్పటించారు. నిర్మల అనే బాధితురాలు తీవ్రంగా కాలిన గాయాలతో మరణించారు.

నిర్మల భర్త ప్రకాష్ 6 నెలల క్రితం ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రకాష్ అన్నయ్య సురేష్, తన తమ్ముడి మరణానికి అతని భార్య నిర్మలనే కారణమని పగ పెంచుకున్నాడు. భర్త చనిపోయినప్పటి నుంచి నిర్మల తన ఇద్దరు పిల్లలతో అత్తామామల ఇంట్లోనే ఉంటోంది. తమ్ముడి మరణానికి నిర్మలనే కారణమని సురేష్ పగ పెంచుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.

Read Also: Covid-19 Cases: ఇండియాలో కొత్తగా 656 కరోనా కేసులు.. ఒకరి మృతి

శనివారం సురేష్ మహిళపై దాడి చేసి ఇంటి నుంచి బయటకు లాగి పెట్రోల్ పోసి నిప్పటించారు. దీంతో ఆమె అక్కడికక్కడే మరణించింది. ‘‘మీ చెల్లిలికి నిప్పంటించాము’’ అంటూ సురేష్ నుంచి మాకు ఫోన్ వచ్చిందని నిర్మల సోదరుడు చెప్పారు. భర్త మరణానికి తన సోదరి కారణమని చెబుతూ చంపేస్తామని గత కొన్ని రోజులుగా బెదిరిస్తున్నారంటూ అతను మీడియా ముందు చెప్పాడు. ఈ రోజు తాను తన చెల్లిలిని ఇంటికి తీసుకురాబోతున్నానని, ఆ లోపే తనను చంపినట్లు ఫోన్ వచ్చిందని కన్నీటిపర్యంతమయ్యాడు. ప్రస్తుతం సురేష్‌ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.