Robbery: బ్యాంకులో బంగారం చోరీకి ఉద్యోగి యత్నం.. సిబ్బందిపై సుత్తితో దాడి చేసి.. దారుణంగా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పని చేస్తున్న బ్యాంకుకే కన్నం వేసేందుకు ప్రయత్నించాడు… అడ్డు వచ్చిన సిబ్బందిపై దారుణంగా దాడి చేశాడు. వాళ్లు రక్తంతో విలవిలలాడుతున్నా.. బంగారం దొంగిలించేందుకు ప్రయత్నించాడు.. సీన్ కట్ చేస్తే.. సీసీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. ఇంతకీ ఆ కంత్రీ క్రిమినల్ ఎవరు? ఆ బ్యాంక్‌కు అతడికి సంబంధం ఏంటి? పని చేస్తున్న బ్యాంకులోనే దోపిడీ చేయడానికి అసలు కారణం ఏంటి?
ఆన్లైన్ బెట్టింగ్, ఆన్లైన్ రమ్మీ..లాంటి అలవాట్లు ఓ బ్యాంక్ మేనేజర్‌ను.. చివరికి దొంగగా మార్చేశాయి. నిన్నటిదాకా బ్యాంక్ మేనేజర్‌గా డిగ్నిటీగా ఉన్న ఆతడు కాస్తా.. ఇప్పుడు కటకటాలు లెక్కిస్తున్నాడు. ఇక్కడ చూడండి.. ఇతనే ఆ వ్యక్తి. విశాఖ సీతమ్మధారకు చెందిన రవి కుమార్ బ్యాంక్ ఆఫ్ బరోడా మర్రిపాలెం బ్రాంచ్ మేనేజర్‌గా విధులు నిర్వహించేవాడు. ఇతడికి కొంత కాలం నుంచి ఆన్లైన్ రమ్మీ, క్రికెట్ బెట్టింగ్ బాగా అలవాటయ్యాయి. వాటిల్లో పెట్టుబడి కోసం ఆయినచోట కానిచోట అప్పులు చేశాడు. అలా పెట్టుబడులు పెట్టి డబ్బంతా పోగొట్టుకున్నాడు. కొన్ని నెలల క్రితం విశాఖ మర్రిపాలెం బ్రాంచ్ నుంచి అనకాపల్లి జిల్లా ఎలమంచిలి బ్రాంచ్‌కు బదిలీ చేశారు.
Also Read
- Hyderabad: హనీట్రాప్ సైబర్ మోసం.. రిటైర్డ్ ఉద్యోగి నుంచి రూ.38 లక్షలు వసూలు.!
- Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
- Vijayawada Crime: విజయవాడలో కలకలం.. పెళ్లికి ఒప్పుకోలేదని ప్రియురాలిపై దాడి.. ప్రియుడు మృతి
- Uttar Pradesh: ‘‘మహిళ’’గా మారేందుకు అడ్డు చెప్పిందని తల్లి దారుణహత్య..
ఇది ఇలా ఉండగా ఆన్లైన్ బెట్టింగ్, రమ్మీకి బాగా అలవాటు పడి లక్షలాది రూపాయలు పోగొట్టుకున్నాడు. వాటికోసం చేసిన అప్పులు, వడ్డీలు పెరిగాయి. అప్పు ఇచ్చిన వాళ్లు ఇంటి మీదకు వచ్చారు. రోజురోజుకీ అప్పు ఇచ్చిన వారి నుంచి ఒత్తిడి పెరిగింది. దీంతో ఎలా అయినా అప్పు తీర్చాలని ప్లాన్ వేశాడు.
ఇందులో భాగంగా గతంలో విధులు నిర్వహించిన మర్రిపాలెం బ్యాంక్ ఆఫ్ బరోడా బ్రాంచ్‌కు వెళ్లాడు. పరిచయస్తుడు, తోటి ఉద్యోగి కావడంతో అక్కడ ప్రస్తుతం పనిచేస్తున్న బ్యాంక్ మేనేజర్ శివరామరాజు, అసిస్టెంట్ మేనేజర్ రమేష్‌లతో మాటలు కలిపాడు. సుమారు రెండు గంటలపాటు ఆఫీస్ విషయాలు లైఫ్ విషయాలు షేర్ చేసుకున్నాడు. రాత్రి 7 గంటల సమయంలో బ్యాంక్ మేనేజరు అసిస్టెంట్ మేనేజర్ గోల్డ్ నిల్వలు టాలీ చేసి క్లోజ్ చేసి లాకర్లో భద్రపరచడానికి వెళ్లారు. అతని వెనకాలే వెళ్లిన రవికుమార్.. ఆ బంగారాన్ని పట్టుకొని పోవడానికి ప్రయత్నించాడు. దోపిడీని అడ్డుకునే ప్రయత్నం చేసిన మేనేజర్, అసిస్టెంట్‌పై ప్లాన్ ప్రకారమే ముందుగా తెచ్చుకున్న సుత్తితో దాడి చేశాడు. వారి తలపైన కొట్టి తీవ్రంగా గాయపరిచాడు. దీంతో బిగ్గరగా అరుస్తూ బయటికి వచ్చారు బ్యాంకు మేనేజర్ శివరామరాజు, అసిస్టెంట్ మేనేజర్ రమేష్. తీవ్ర గాయాలైనటువంటి వారిని చూసిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చి అంబులెన్స్‌లో ఆసుపత్రులకు తరలించారు. అక్కడ నుంచి నిందితుడు రవికుమార్ పరారయ్యాడు.
మరోవైపు సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు సీసీటీవీ పుటేజ్ ఆధారంగా నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. గంటల వ్యవధిలోనే నిందితుడిని పట్టుకున్నారు. పోలీసుల విచారణలో తాను అప్పుల పాలైపోయానని.. ఆన్లైన్ గేమ్స్, బెట్టింగ్ వల్ల చాలా నష్టపోయానని.. అప్పులను తీర్చడానికే ఈ దొంగతనానికి ఒడిగట్టినట్లు తెలిపాడు. నిందితుడు రవికుమార్‌పై హత్యాయత్నం, దోపిడీ యత్నం కింద కేసులు నమోదు చేశారు పోలీసులు. ఈ దాడిలో గాయపడ్డ మేనేజర్ శివరామరాజు అసిస్టెంట్ మేనేజర్ రమేష్‌కు మెరుగైన వైద్యం అందిస్తున్నారు.
తాజావార్తలు
-
Sharwanand : శర్వానంద్ కెరీర్లో కొత్త ఫేజ్
-
Kharagpur-Amaravati Greenfield Highway: అమరావతికి ఈస్ట్ గేట్‌వే.. 1,107 కి.మీ. గ్రీన్‌ఫీల్డ్ హైవే.. రూట్ ఇదే..!
-
Mayawati: గత నెలలో తొలగింపు.. మళ్లిప్పుడు పదవి.. మేనల్లుడికి కీలక పోస్ట్ ఇచ్చిన మాయావతి
-
TG CPGET రెండో విడత సీట్ల కేటాయింపు.. భారీగా మిగిలిపోనున్న పీజీ సీట్లు..
-
Amazon Great Indian Festival Sale: రూ.6 వేలకే 200 ఇంచుల ‘స్మార్ట్ ప్రొజెక్టర్’.. అమెజాన్ సేల్‌లో అదిరిపోయే ఆఫర్..!
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!