Tragedy : విశాఖపట్నం జిల్లాలోని పెందుర్తిలో అత్తను దారుణంగా హత్య చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. కుటుంబ కలహాల నేపథ్యంలో కోడలు లలిత తన అత్తను నిర్దాక్షిణ్యంగా హతమార్చినట్టు పోలీసులు గుర్తించారు. సాధారణ అగ్ని ప్రమాదంలా చూపించేందుకు లలిత చేసిన నాటకాలు షాకింగ్‌గా మారాయి.
పోలీసుల సమాచారం ప్రకారం.. లలిత ముందుగా ‘దొంగ–పోలీస్ ఆట’ పేరుతో అత్తను కుర్చీలో కూర్చోబెట్టి తాళ్లతో బింగించి కట్టేసింది. ఆ తరువాత క్రూరంగా ఆమెపై పెట్రోలు పోసి నిప్పంటించింది. నిప్పు అంటుకున్న అత్త అక్కడికక్కడే తీవ్ర గాయాలతో మృతి చెందగా, లలిత దీనిని అగ్ని ప్రమాదం అంటూ అందరినీ నమ్మించే ప్రయత్నం చేసింది. దీపం అంటుకొని ప్రమాదవశాత్తు మరణించినట్లు సీన్ క్రియేట్ చేసి కుటుంబ సభ్యులు, పొరుగువారిని తప్పుదారి పట్టించే ప్రయత్నం చేసిన లలిత చివరకు పోలీసుల విచారణలో అసలు విషయం చెప్పింది. పెందుర్తిలో జరిగిన ఈ షాకింగ్ హత్య స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
అయితే..NTVతో వెస్ట్ ఏసీపీ పృథ్వితేజ మాట్లాడుతూ.. పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న వృద్ధురాలు అనుమానస్పద మృతి కేసును గంటల వ్యవధిలోనే ఛేదించామన్నారు. నిన్న ఉదయం అప్పన్నపాలెంలోని వర్షిని అపార్ట్మెంట్స్ లో ఓ వృద్ధురాలికి మంటలు అంటుకున్నాయని సమాచారం వచ్చిందని, సంఘటన స్థలానికి వెళ్లి చూస్తే అనుమానాస్పదంగా ఉందని అనుమానాస్పద మృతి కేసు నమోదు చేసామన్నారు. మృతురాలు జయంతి మహాలక్ష్మి (63) కోడలే మాకు సమాచారం ఇచ్చారని, అత్త కళ్లకు గంతలు కట్టుకొని కుర్చీలో కాళ్లు చేతులు కట్టి దొంగ పోలీస్ ఆట ఆడుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుందని తెలిపింది. ఈ ప్రమాదంలో నిందితురాలి కూతురుకు కాలిన గాయాలయ్యాయి. మేము ఆమె ఫోన్ స్వాధీనం చేసుకొని విచారించగా అందులో కీలక విషయాలు వెలుగు చూసాయన్నారు.
ఫోన్ లో ఒక వ్యక్తిని ఎలా చంపాలి? ఎలా తప్పించుకోవాలి అనే విధంగా సెర్చ్ చేసినట్లు గుర్తించామని, అత్తా కోడళ్ళకు గత కొన్ని సంవత్సరాలుగా గొడవలు ఉన్నాయని, ప్లాన్ ప్రకారమే పెట్రోల్ బంకులో బాటిల్లో పెట్రోల్ పట్టుకొని ఇంటికి తీసుకువచ్చింది కోడలు.. మనవరాలుతో కలిసి ఈ ఆట ఆడుతుండగా పెట్రోల్ పోసి నిప్పంటించింది.. అత్త పెట్టిన వేధింపులు భరించలేక ఈ ఘాతుకానికి పాల్పడింది.. నిందితురాలను రిమాండ్ కు తరలిస్తామని ఏసీపీ తెలిపారు.
SEBI: డిజిటల్ గోల్డ్ కొంటున్నారా?.. రూ.10కి బంగారం కొనేవారికి సెబీ తీవ్ర హెచ్చరిక
