Site icon NTV Telugu

ఫక్కీరు వేషంలో మోసం.. బంగారు కొట్టేసే ప్రయత్నం

మాయగాళ్ళు అడుగడుగునా పొంచి వున్నారు. ఆదమరిస్తే చాలు ఇంటిని, ఒంటిని కూడా గుల్ల చేసే జగజ్జంత్రీలు తిరుగుతున్నారు. కర్నూలు జిల్లాలో ఓ దొంగ ఫక్కీరు బాగోతం బయటపడింది. కొత్తపల్లె మండలం దుద్యాలలో ఫకీరు వేషంలో మోసగించే యత్నం చేశాడో ప్రబుద్ధుడు. నెమలి ఈకల పట్టుకొని మీ ఇంటిని బాగు చేస్తామని మాయ మాటలు చెప్పారు నకలీ ఫక్కీర్లు.

ఓ మహిళ బంగారు ఉంగరం కొట్టేసి ప్రయత్నం చేశారు. మత్తులో నుంచి స్పృహలోకి వచ్చిన మహిళ విషయాన్ని చుట్టుపక్కల వారికి చెప్పడంతో అప్రమత్తమైన గ్రామస్తులు నకిలీ ఫక్కీర్లను పట్టుకునే ప్రయత్నాలు చేశారు. చివరకు వారి పాపం పండింది. జనం చేతిలో చావుదెబ్బలు తినాల్సి వచ్చింది. మహిళ కేకలతో రంగంలోని దిగిన గ్రామస్తులు ఆ మాయ ఫక్కీర్ల భరతం పట్టారు. నకిలీ ఫక్కీర్లకు దేహశుద్ది చేసి పోలీసులకు అప్పగించారు గ్రామస్తులు. ఇలాంటి మోసగాళ్ళ పట్ల అప్రమత్తంగా వుండాలని పోలీసులు సూచించారు.

Exit mobile version