Site icon NTV Telugu

Vijayawada: సిటీలో టెన్షన్.. విజయవాడలో వందల బైకులతో రౌడీషీటర్ల ర్యాలీ కలకలం..

Vijayawada

Vijayawada

Vijayawada: విజయవాడలో రౌడీషీటర్లు హల్‌చల్ చేశారు. కృష్ణలంక రౌడీషీటర్ పండు అలియాస్ పావురం అంతిమయాత్రను సిటీలో ఓ రేంజ్‌లో నిర్వహించారు. అంతే కాదు.. వందల కొద్ది మంది రౌడీషీటర్లు రోడ్ల మీదకు వచ్చి ర్యాలీ చేయడం.. సిటీలో అలజడి రేపింది. దీంతో ఈ ఊరేగింపును పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. ఇందులో బ్లేడ్ బ్యాచ్ సభ్యులు కూడా పాల్గొన్నట్టు అనుమానిస్తున్నారు. విజయవాడ రౌడీ షీటర్ పండు అలియాస్ పావురం సూర్యాపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఆటో నడుపుతూ యాక్సిడెంట్లో మృతి చెందాడు. ఐతే అతని అంత్యక్రియలను తోటి రౌడీషీటర్లు అత్యంత ఘనంగా నిర్వహించారు. విజయవాడ ప్రభుత్వాసుపత్రి నుంచి భవానీపురం పొలం వరకు ర్యాలీగా అంతిమయాత్ర జరిగింది. ఇందులో గంజాయి బ్యాచ్, బ్లేడ్ బ్యాచ్ సభ్యులు కూడా పాల్గొన్నారు. అంతే కాదు సింగ్ నగర్ ఎల్బీఎస్ నగర్‌కు చెందిన బల్జిద్, పటేల్ నగర్‌కు చెందిన బాజీ, జక్కంపూడికి చెందిన శంకర్‌తో పాటు బ్లేడ్ బ్యాచ్‌లో కీలకంగా వ్యవహరించే శివయ్య అనుచరులు పెద్ద ఎత్తున పాల్గొన్నట్టు పోలీసులు గుర్తించారు. వీరితోపాటు నగరంలోని పలు ప్రాంతాలకు చెందిన బ్లేడ్ బ్యాచ్ సస్పెక్ట్ షీటర్లు పాల్గొన్నారు. వారి వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్ అయ్యాయి. దీనితో పోలీసులు విచారణ చేపట్టారు.

READ MORE: Ragi Halwa Recipe: నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోయే టేస్టీ,హెల్తీ బెల్లం రాగి హల్వా..

ఈ వీడియోలు వైరల్‌గా మారటంతో పోలీసులు మొత్తం వ్యవహారంపై ఫోకస్ పెట్టారు. పావురం మృతికి సంబంధించి నిర్వహించిన ర్యాలీ ఘటనపై విచారణ చేపట్టారు. అంతమయాత్ర నిర్వహించి ప్రజలకు ఇబ్బంది కలిగించిన కారణంగా కొందరిని అరెస్ట్ చేసి DJ వాహనాన్ని, 20 ద్విచక్ర వాహనాలను సీజ్ చేశారు పోలీసులు. అదేవిధంగా స్థానికుల ఫిర్యాదు మేరకు కృష్ణలంకకు చెందిన నవీన్ సాయి సూర్య కోడి మరికొందరిపై కేసు నమోదు చేశారు. పలువురుని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఎవరైనా శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిక జారీ చేశారు. సీసీటీవీ ఫుటేజ్‌లు పరిశీలించి అందులో పాల్గొన్న వారు రౌడీషీటర్లు ఉంటే వారిపై చర్యలకు సిద్ధమవుతున్నారు..

Exit mobile version