Vijayawada Horror: విజయవాడ ఉర్మిళ నగర్‌లో ఘోర దారుణ సంఘటన చోటు చేసుకుంది. వృద్ధురాలి సొంత అక్క కుమారుడు ముక్కలు ముక్కలుగా నరికినట్లు సమాచారం. తల, కాళ్లు, చేతులు, మొండెం భాగాలను గోనె సంచిలో కట్టి వేర్వేరు ప్రాంతాల్లోని మురుగు కాల్వల్లో పడేశాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గత ఐదు రోజులుగా వృద్ధురాలు కనబడలేదని భవానీపురం పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు నమోదు అయింది.
Read Also: Evergreen Club 80 : 80స్ రీ యూనియన్.. తళుక్కుమన్న స్టార్స్ ను చూశారా..
వివరాల్లోకి వెళితే.. భవానీపురం ఊర్మిళనగర్ లో వృద్ధురాలు నివాసం ఉంటుంది. తన నివాసానికి సమీపంలో అక్క కొడుకు కుటుంబ సభ్యులతో కలిసి నివాసం ఉంటున్నాడు. గత కొన్ని రోజుల నుంచి భర్తభార్యలకు గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో భార్య తన పుట్టింటికి వెళ్ళిపోయింది. తన భార్య వెళ్లిపోవడానికి కారణం పిన్నినే అని తెలుసుకొని ఆమెపై పగ పెంచుకున్నాడు నిందితుడు. ఇక, ఆమెను హత్య చేయాలనీ నిర్ణయించుకున్నాడు.. దీని కోసం పక్క ప్రణాళిక సిద్ధం చేసుకున్నాడు.. అక్టోబర్ 1వ తేదీన మాయమాటలు చెప్పి బండిపై ఎక్కించుకొని తన ఇంటికి పిన్నీని తీసుకు వెళ్ళాడు.. అప్పటికే హత్య చేయడానికి సిద్ధం చేసుకున్న పదునైన ఆయుధలతో వరసకు పిన్ని అయినా వృద్ధురాలిని తన మైనర్ కొడుకుతో కలిసి దాడి చేసి చంపేశాడు.
Read Also: Delhi: విదేశీ కోచ్‌లపై వీధికుక్కల దాడి.. ఇది దేశ ప్రతిష్టకు మచ్చ-బీజేపీ లీడర్
ఇక, ఆ వృద్ధురాలి తల, కాళ్లు, చేతులు నరికి విజయవాడలోని అక్కనిసన్ స్కూల్ సమీపంలో నిందితులు పడేశారు. అనంతరం మొండాన్ని విజయవాడ బొమ్మసాని నగర్ లో పడేశారు. ఆ తర్వాత నంద్యాలకు పరారయ్యారు. ఈ ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు మృతురాలి శరీర భాగాలను సేకరించారు.. కానీ, కాళ్లు మాత్రం లభించలేదని సమాచారం. హత్యలో మైనర్ అయిన కుమారుడి సహకారం ఉండటంతో.. ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.
