Site icon NTV Telugu

Vaishnavi Murder: యువతి వైష్ణవి మర్డర్ మిస్టరీ.. ఇంతకీ హత్యా..? పరువు హత్యా..?

Vaishnavi Murder1

Vaishnavi Murder1

కడప జిల్లా గండికోటలో యువతి వైష్ణవి మర్డర్ మిస్టరీ.. ఇప్పటికీ గండికోట రహస్యంగానే ఉంది. ఆమెను ఎవరు హత్య చేశారో ఇప్పటి వరకు ఓ నిర్ధారణకు రాలేకపోతున్నారు పోలీసులు. ప్రియుడే హత్య చేశాడని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. కానీ ప్రియుడి పాత్ర లేదని పోలీసులు తేల్చారు. ఇంతకీ పలు మలుపులు తిరుగుతున్న వైష్ణవి హత్య కేసులో ప్రధాన పాత్రధారులెవరు? హత్యా, పరువు హత్యా అనే కోణంలో పోలీసుల దర్యాప్తు సాగుతోంది. కడప జిల్లా గండికోటలో మైనర్ బాలిక వైష్ణవి శవమై తేలింది. ఆమెను ఎవరు హత్య చేశారో అనే దానిపై ఇప్పటి వరకు ఓ క్లారిటీ రాలేదు. ప్రియుడు లోకేష్.. ఆమెకు మాయ మాటలు చెప్పి నిర్మానుష్య ప్రదేశానికి తీసుకు వెళ్లి హత్య చేశాడని వైష్ణవి పేరెంట్స్ ఆరోపిస్తున్నారు.

READ MORE: Cyber Crime: సైబర్ నేరగాళ్ల తోకలు కత్తిరిస్తున్న టీజీ పోలీసులు.. రాష్ట్రం దాటినా వదలట్లే…

వైష్ణవి, లోకేష్ ఇద్దరూ పల్సర్ బైక్ పై ఆనందంగా గండికోటకు వెళుతున్న దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. రెండు గంటల తర్వాత లోకేష్ ఒంటరిగా వేగంగా జమ్మలమడుగు వైపు వెళుతున్న దృశ్యాలు కూడా సీసీ కెమెరాలో కనిపించాయి. అయితే ఈ 2 గంటల్లో ఏం జరిగింది? మైనర్ బాలికను ఆ యువకుడే హత్య చేసి పరారయ్యాడా ! లేక ఎవరికైనా ఆ బాలికను అప్పగించి వెళ్ళాడా? లేదా మరెవరైనా అతనిని భయపెట్టి ఆ బాలికను హత్య చేశారా? అన్నది సందిగ్ధంగా మారింది. బాలిక మృతదేహాన్ని గండికోట నుంచి జమ్మలమడుగు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ఫోరెన్సిక్ వైద్యులు చేత పోస్ట్ మార్టం చేయించిన పోలీసులకు విస్తుపోయే నిజాలు బయటకు వచ్చాయి. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాత పోలీసులకు పలు అనుమానాలు తావిచ్చాయి. హత్యకు గురైన వైష్ణవిపై లైంగిక దాడి జరగలేదని.. బలంగా కొట్టడంతో వైష్ణవి శరీరంలోని అంతర్గత భాగాలు దెబ్బ తినడం వల్లనే మరణించిందని పోస్ట్‌మార్టం నివేదిక ద్వారా తేలింది. పోలీసులు అన్ని కోణాల్లో విచారించి, లోకేష్ ఇచ్చిన సమాచారాన్ని మరొకసారి చెక్ చేసుకుని ప్రియుడు వైష్ణవిని హత్య చేయలేదని నిర్ధారణకు వచ్చారు..

READ MORE: Poolachokka Naveen: నెగిటివ్ రివ్యూ కేసు.. పోలీసుల అదుపులో యూట్యూబర్ పూలచొక్క నవీన్..

మైనర్ బాలిక వైష్ణవిపై ఎవరు లైంగిక దాడికి పాల్పడలేదు. మరి వైష్ణవిని అంత దారుణంగా కొట్టి చంపాల్సిన అవసరం ఎవరికి ఉంది? అనే కోణంలో పోలీసులు విచారణ మొదలుపెట్టారు. అంతేకాకుండా వైష్ణవి మృతదేహానికి ఒక చెవి దుద్ది మాత్రమే ఉండటం గమనించారు పోలీసులు. పరిసరాలు మొత్తం జల్లెడ పట్టారు. అయినా చెవి దుద్ది కనిపించకపోవడంతో వైష్ణవిని అక్కడే హత్య చేశారా? లేక మరెక్కడైన హత్య చేసి అక్కడ పడేశారా? అనే కోణంలో పోలీసుల విచారణ జరుగుతోంది.. లోకేష్ వైష్ణవి గండికోటకు వెళ్లిన సమాచారం వైష్ణవి స్నేహితుల ద్వారా అన్న సురేంద్ర తెలుసుకున్నాడు. లోకేష్ బంధువులకు ఫోన్ చేసి మీ అబ్బాయి ఎక్కడున్నాడంటూ ప్రశ్నించడం.. వారు తెలియదని సమాధానం చెప్పడంతో.. ఇద్దరూ గండికోటకు వెళ్లారని నిర్దారించుకున్నాడు. గండికోటకు వెళ్లాడు. అయితే వైష్ణవి అన్న సురేంద్ర.. గండికోటకు వస్తున్న విషయాన్ని లోకేష్ బంధువులు ఫోన్ చేసి చెప్పడంతో.. సురేంద్ర గండికోటలో తమను చూస్తే సమస్య అవుతుందని ఉద్దేశించి వైష్ణవిని గండికోట ముఖద్వారం వద్దే వదిలిపెట్టాడు లోకేష్. ఒక్కడే పల్సర్ బైక్‌పై అక్కడి నుంచి వెళ్లిపోయాడు.

READ MORE: Poolachokka Naveen: నెగిటివ్ రివ్యూ కేసు.. పోలీసుల అదుపులో యూట్యూబర్ పూలచొక్క నవీన్..

వైష్ణవి, లోకేష్‌ను వెతుక్కుంటూ గండికోటకు చేరుకున్న సురేంద్ర.. అక్కడ వైష్ణవి ఫోటోని చూపించి పలువురిని అడిగినట్లు తెలుస్తోంది. లోకేష్ గండికోట నుంచి వెళ్లిన తర్వాత వైష్ణవి అన్న సురేంద్ర గండికోటకు చేరుకున్న తర్వాత వైష్ణవి హత్య ఏ విధంగా జరిగిందని కోణంలో పోలీసులు విచారణ మొదలుపెట్టారు. దీంతో వైష్ణవి హత్య చేసింది వైష్ణవి అన్న సురేంద్రనే అయి ఉండొచ్చు అనే కోణంలో విచారణ చేస్తున్నారు.. లోకేష్, వైష్ణవి ప్రేమ వ్యవహారం ఇంట్లో తెలిసిన తర్వాత స్వగ్రామమైన హనుమన గుత్తిని వదిలిపెట్టి వైష్ణవి కుటుంబం.. ప్రొద్దుటూరుకు చేరుకుంది. కానీ తమ మాట వినకుండా మళ్ళీ లోకేష్‌తో గండికోటకు కలిసి వెళ్లిన వైష్ణవిపై అన్న సురేంద్ర కోపంతో దాడి చేశాడా? లేక ఈ హత్యలో మరెవరి హస్తమైనా ఉందా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.

Exit mobile version