Site icon NTV Telugu

Uttarapradesh : 8 ఏళ్ల బాలికపై 80ఏళ్ల వృద్ధుడు లైంగికదాడి..దారుణం..

Minor Harasment Up

Minor Harasment Up

కామాంధులకు వావి వరుసలు,వయస్సుతో సంబంధంలేదు.. కేవలం కామ కోరికలను తీర్చుకోవాలి.. ప్రభుత్వం ఎన్ని రకాల చట్టాలను తీసుకొచ్చిన కూడా ఈ మృగాల్లో ఎటువంటి మార్పులు రావడం లేదు.. తాజాగా ఓ అమానుష ఘటన వెలుగు చూసింది.. 8 బాలికపై వృద్ధుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు.. బాలిక తండ్రి గమనించి పోలీసులకు ఫిర్యాదు చెయ్యడంతో ఈ ఘటన బయటకు వచ్చింది..

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఘనశ్యామ్ దాస్ యూపీలోని బర్రా పోలీస్ స్టేషన్ పరిధిలోని హైవే పక్కన ఉన్న దేవాలయ సముదాయంలో నివసిస్తున్నాడు. ఘనశ్యామ్ దాస్ పూజలు చేసి ఆలయాన్ని చూసుకుంటారు. హమీర్‌పూర్ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి ఆలయ ప్రాంగణం పక్కనే గుడిసె వేసుకుని కుటుంబంతో జీవిస్తున్నాడు.. అతనికి ఇద్దరు కూతుళ్లు..ఈ క్రమంలో ఆ 80 ఏండ్ల పూజారి.. ఓ 8 ఏండ్ల చిన్నారిపై కన్నేశాడు. ఒంటరిగా ఉన్న ఆ చిన్నారికి డబ్బులు ఆశ చూపించి ఇంట్లోకి పిలిపించుకొని లైంగిక దాడి చేసేవాడు..

 

ఈ విషయాన్ని గమనించిన బాలిక తండ్రి అడగగా..కొద్దిరోజులుగా ఘనశ్యామ్ దాస్ బాబా తనని తన ఇంటికి పిలిపించి అసభ్యకర పనులు చేసేవాడని బాధితురాలు తన తండ్రితో చెప్పింది. ప్రతిఫలంగా డబ్బులు ఇచ్చేవారు, దీంతో పాటు ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించేవాడని వాపోయింది. ఈ ఘటనపై బాధితురాలి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు..ఘనశ్యామదాస్‌ను అరెస్టు చేశారు.నిందితుడి ఇంటి నుంచి పెద్ద ఎత్తున గంజాయిని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు..ఈ ఘటన పై వార్తలు వైరల్ కావడంతో అతన్ని ఉరి తీయ్యాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు..

Exit mobile version