కామాంధులకు వావి వరుసలు,వయస్సుతో సంబంధంలేదు.. కేవలం కామ కోరికలను తీర్చుకోవాలి.. ప్రభుత్వం ఎన్ని రకాల చట్టాలను తీసుకొచ్చిన కూడా ఈ మృగాల్లో ఎటువంటి మార్పులు రావడం లేదు.. తాజాగా ఓ అమానుష ఘటన వెలుగు చూసింది.. 8 బాలికపై వృద్ధుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు.. బాలిక తండ్రి గమనించి పోలీసులకు ఫిర్యాదు చెయ్యడంతో ఈ ఘటన బయటకు వచ్చింది..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఘనశ్యామ్ దాస్ యూపీలోని బర్రా పోలీస్ స్టేషన్ పరిధిలోని హైవే పక్కన ఉన్న దేవాలయ సముదాయంలో నివసిస్తున్నాడు. ఘనశ్యామ్ దాస్ పూజలు చేసి ఆలయాన్ని చూసుకుంటారు. హమీర్‌పూర్ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి ఆలయ ప్రాంగణం పక్కనే గుడిసె వేసుకుని కుటుంబంతో జీవిస్తున్నాడు.. అతనికి ఇద్దరు కూతుళ్లు..ఈ క్రమంలో ఆ 80 ఏండ్ల పూజారి.. ఓ 8 ఏండ్ల చిన్నారిపై కన్నేశాడు. ఒంటరిగా ఉన్న ఆ చిన్నారికి డబ్బులు ఆశ చూపించి ఇంట్లోకి పిలిపించుకొని లైంగిక దాడి చేసేవాడు..
ఈ విషయాన్ని గమనించిన బాలిక తండ్రి అడగగా..కొద్దిరోజులుగా ఘనశ్యామ్ దాస్ బాబా తనని తన ఇంటికి పిలిపించి అసభ్యకర పనులు చేసేవాడని బాధితురాలు తన తండ్రితో చెప్పింది. ప్రతిఫలంగా డబ్బులు ఇచ్చేవారు, దీంతో పాటు ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించేవాడని వాపోయింది. ఈ ఘటనపై బాధితురాలి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు..ఘనశ్యామదాస్‌ను అరెస్టు చేశారు.నిందితుడి ఇంటి నుంచి పెద్ద ఎత్తున గంజాయిని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు..ఈ ఘటన పై వార్తలు వైరల్ కావడంతో అతన్ని ఉరి తీయ్యాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు..